యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆనంద్ దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా చేసిన రెండో చిత్రమే ‘ఎపిక్’. మంచి ప్రమోషన్స్ నడుమ రిలీజ్ కి తీసుకొచ్చిన ఈ సినిమా ఇపుడు వరల్డ్ వైడ్ గట్టి ఓపెనింగ్స్ నే రాబట్టింది అని చెప్పవచ్చు. దర్శకుడు ఆదిత్య హాసన్ తెరకెక్కించిన ఏ రేటెడ్ రోమ్ కామ్ పై నమ్మకంతో ముందు రోజే ప్రీమియర్స్ కూడా వేశారు.
ఇలా ఆ ప్రీమియర్స్ సహా మొదటి రోజు వసూళ్లు కలిపి మేకర్స్ 5 కోట్ల ప్రపంచ వ్యాప్త గ్రాస్ ని ఎపిక్ రాబట్టినట్టు ఖరారు చేశారు. సో ఎపిక్ తో మంచి స్టార్ట్ ని ఈ యువ జంట అందుకున్నారని చెప్పొచ్చు. ఇక డే 2 బుకింగ్స్ కూడా డీసెంట్ గా కొనసాగుతున్నాయి. సో ఈ వీకెండ్ కి కూడా సినిమా బాగానే డబ్బులు చేసే అవకాశం ఉంది. ఇక ఈ చిత్రంలో శివాజీ, వాసుకి కీలక పాత్రల్లో నటించగా హేశం అబ్దుల్ వాహాబ్ సంగీతం అందించాడు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణం వహించారు.
A beautiful beginning to an EPIC journey 💥💥
Premieres + Day 1
Worldwide Gross 5 CRORES+ ❤️🫶🏻Celebrate the beautiful slice of life #EPIC has in store for everyone this weekend 😍 #EPICBlockbuster
Book your tickets 🎟️https://t.co/DbxShUXblx#AnandDeverakonda… pic.twitter.com/S2Z1teE77n— Sithara Entertainments (@SitharaEnts) September 12, 2026


