ప్రభాస్ ‘స్పిరిట్’లో ఐశ్వర్య లక్ష్మి.. నిజమేనా ?

ప్రభాస్ ‘స్పిరిట్’లో ఐశ్వర్య లక్ష్మి.. నిజమేనా ?

Published on Sep 13, 2026 2:02 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రాబోతున్న భారీ అంచనాలు ఉన్న సినిమా ‘స్పిరిట్’. ఈ పోలీస్ యాక్షన్ డ్రామా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఐతే, లేటెస్ట్ కథనాల ప్రకారం, ఈ చిత్రంలో ఒక అతిథి పాత్ర కోసం ఐశ్వర్య లక్ష్మిను తీసుకున్నారని తెలుస్తోంది. ఓ పోలీస్ పాత్రలో ఐశ్వర్య లక్ష్మి ఈ సినిమాలో నటిస్తోందని.. ఆమె పాత్ర చాలా ఎమోషనల్ గా సాగుతుందని తెలుస్తోంది. కాగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఓ పవర్‌ ఫుల్ కాప్ స్టోరీగా రాబోతుంది.

ఇక ఈ సినిమాలో త్రుప్తి దిమ్రిని హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ లో ప్రభాస్ పక్కా వైల్డ్ అండ్ మాస్ అవతార్ లో కనిపించబోతున్నాడు. ఈ చిత్రాన్ని టి-సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మించనున్నాయి. అన్నట్టు ‘స్పిరిట్‌’ మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని.. సందీప్ రెడ్డి వంగా నుంచి మరో వినూత్న సినిమా రాబోతుంది. మొత్తానికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

తాజా వార్తలు