వారణాసి: జక్కన్నతో వర్క్ పై మహేష్ క్రేజీ స్టేట్మెంట్ వైరల్

వారణాసి: జక్కన్నతో వర్క్ పై మహేష్ క్రేజీ స్టేట్మెంట్ వైరల్

Published on Sep 15, 2026 9:04 AM IST

Varanasi

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఇప్పుడు నటిస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ వారణాసి కోసం అందరికీ తెలిసిందే. దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. అయితే జక్కన్న తో వర్క్ ఎలా ఉంటుందో తన గత సినిమాల హీరోలని అడిగితే చెబుతారు.

రాజమౌళి చిన్న సీన్ కోసం ఎంత పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తారు, ఆర్టిస్టుల నుంచి బెస్ట్ రాబట్టే క్రమంలో జక్కన్న పెట్టే హింస అంతా ఇంతా కాదు అని గత సినిమా RRR హీరోలు చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం మరో ఊహించని స్టేట్మెంట్ ఇవ్వడం కేజ్రీగా మారింది.

నిజాయితీగా చెప్పాలంటే రాజమౌళితో వర్క్ చాలా చాలా సులభం అని స్టేట్మెంట్ ఇవ్వడం ఒకింత సర్ప్రైజింగ్ గా మారింది. దీనితో ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. మహేష్ మరియు నటులు ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొనగా అందులో చేసిన స్టేట్మెంట్ గా ఇది తెలుస్తుంది.

తాజా వార్తలు