ఫోటో మూమెంట్ : త్రివిక్రమ్‌తో శ్రీనిధి సందడి.. మామూలుగా లేదుగా..!

ఫోటో మూమెంట్ : త్రివిక్రమ్‌తో శ్రీనిధి సందడి.. మామూలుగా లేదుగా..!

Published on Sep 19, 2026 12:42 AM IST

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘ఆదర్శ కుటుంబం’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. 2026 అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతున్న ఈ భారీ చిత్రంపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గ నటిస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఆమె సోషల్ మీడియాలో పంచుకున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. దర్శకుడు త్రివిక్రమ్ స్క్రిప్ట్ వర్క్‌లో నిమగ్నమై ఉండగా, తన సరదా మూమెంట్స్‌కి సంబంధించిన ఆకట్టుకునే ఫోటోలను శ్రీనిధి అభిమానులతో పంచుకుంది. ఈ సినిమాలో నివేథా పేతురాజ్, నారా రోహిత్, పూజిత పొన్నాడ, రావు రమేష్ మరియు బ్రహ్మాజీ ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ స్వరాలు సమకూరుస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు