పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చిన రణ్‌వీర్-దీపికా జంట..!

పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చిన రణ్‌వీర్-దీపికా జంట..!

Published on Sep 19, 2026 9:51 PM IST

బాలీవుడ్ స్టార్ జంట రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకోనె దంపతులు తీపి కబురు అందించారు. రాధాష్టమి పర్వదినాన వారికి రెండవ ఆడపిల్ల జన్మించింది. ఈ సంతోషకరమైన వార్తను వారు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. “వెల్కమ్ బేబీ గర్ల్, 19/9/2026” అని పేర్కొంటూ తమ పెద్దకుమార్తె ‘దువా’ తో పాటు రణ్‌వీర్, దీపికా పేర్లతో పెట్టిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట తీవ్రంగా వైరల్ అవుతోంది.

ఈ దంపతులకు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరోవైపు, ఈ జంట తమ తమ సినిమాలతో వృత్తిపరంగా కూడా ఎంతో బిజీగా ఉన్నారు. ‘ధురంధర్’ ఫ్రాంచైజ్ సాధించిన సంచలన విజయం తర్వాత, రణ్‌వీర్ సింగ్ ప్రస్తుతం జై మెహతా దర్శకత్వంలో ‘ప్రళయ్’ అనే భారీ బడ్జెట్ జోంబీ థ్రిల్లర్ చిత్రంలో నటిస్తున్నాడు.

ఇక దీపికా పడుకోనె విషయానికొస్తే, అల్లు అర్జున్ మరియు దర్శకుడు అట్లీ కాంబినేషన్లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ లో నటించేందుకు సిద్ధమవుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు