‘ది ప్యారడైస్’ తర్వాత నాని దూకుడు.. ఏకంగా మూడు..!

‘ది ప్యారడైస్’ తర్వాత నాని దూకుడు.. ఏకంగా మూడు..!

Published on Sep 19, 2026 11:32 PM IST

న్యాచురల్ స్టార్ నాని గత ఏడాదిన్నరగా ‘ది ప్యారడైజ్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. దీనివల్ల ఆలస్యమైన సుజీత్ దర్శకత్వంలోని ‘బ్లడీ రోమియో’ చిత్రీకరణ ఈ అక్టోబర్‌ నుంచి ప్రారంభం కానుంది. లండన్‌లో ఎక్కువ భాగం షూటింగ్ జరుపుకోనున్న ఈ భారీ చిత్రాన్ని 2027 సమ్మర్‌లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

​ఈ రెండు సినిమాలతో పాటు నాని లైనప్‌లో మరో రెండు ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. ‘జెర్సీ’ కాంబినేషన్‌ను రిపీట్ చేస్తూ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక సినిమా చేయనుండగా, తమిళ దర్శకుడు శిబి చక్రవర్తితో శ్రీనివాసా చిట్టూరి నిర్మాణంలో 2027లో మరొక సినిమా పట్టాలెక్కనుంది.

మొత్తానికి ‘ది ప్యారడైస్’ తర్వాత నాని తన స్పీడ్ పెంచుతూ ఏకంగా మూడు ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టడం హాట్ టాపిక్ గా మారింది.

తాజా వార్తలు