‘జైలర్ 2’తో ‘రాకా’ ట్రీట్!? బిగ్ స్క్రీన్స్ పై రచ్చ రచ్చే!

‘జైలర్ 2’తో ‘రాకా’ ట్రీట్!? బిగ్ స్క్రీన్స్ పై రచ్చ రచ్చే!

Published on Sep 19, 2026 10:25 PM IST

ఈ దసరా రేస్ లో బిగ్ స్క్రీన్స్ పై సందడి చేసేందుకు వస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో చేసిన భారీ చిత్రం ‘జైలర్ 2’ కూడా ఒకటి. ఎన్నో అంచనాలు ఉన్న ఈ క్రేజీ సీక్వెల్ నిర్మాణం వహించిన నిర్మాణ సంస్థే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో భారీ చిత్రం ‘రాకా’ చేస్తున్నారు.

అయితే మరికొన్ని రోజుల్లో రాకా గ్రాండ్ ట్రీట్ రావడం ఖాయం అయ్యిన సంగతి తెలిసిందే. అట్లీ పుట్టినరోజు కానుకగా మేకర్స్ రాకా ప్రపంచాన్ని పరిచయం చేస్తూ ఓ గ్రాండ్ విజువల్ గ్లింప్స్ ని విడుదల చేయనున్నారు. అయితే ఇది ముందు ఆన్లైన్ లో వచ్చాక బిగ్ స్క్రీన్ పై కూడా జైలర్ 2 ప్రింట్ లతో వచ్చే అవకాశం కూడా ఉంది.

జైలర్ 2 ని ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయడం గ్యారెంటీ సో ఎలాగో తమ నిర్మాణ సంస్థే కాబట్టి రాకా గ్లింప్స్ కూడా జైలర్ 2 ప్రింట్స్ కి జత చేసినా ఎలాంటి ఆశ్చర్యం లేదు. సో మధ్యలో ఎలాగో ఉన్న గ్యాప్ లో ఆ గ్లింప్స్ సెన్సార్ చేసి ఆ సినిమాతో వెండితెరపై ప్రెజెంట్ చేసే అవకాశం ఉంది. మరి ఇదే నిజం అయితే బిగ్ స్క్రీన్స్ పై అట్లీ, అల్లు అర్జున్ లు రచ్చ లేపడం గ్యారెంటీ.

తాజా వార్తలు