ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ గా ‘రణబాలి’ ఫస్ట్ సింగిల్!

ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ గా ‘రణబాలి’ ఫస్ట్ సింగిల్!

Published on Sep 22, 2026 3:55 PM IST

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా దర్శకుడు రాహుల్ తెరకెక్కించిన భారీ హిస్టారికల్ డ్రామానే ‘రణబాలి’. సాలిడ్ హైప్ ఉన్న ఈ చిత్రం నుంచి మేకర్స్ అవైటెడ్ ఫస్ట్ సింగిల్ ఏందయ్యా సామి లిరికల్ ని విడుదల చేశారు.

సంగీత దర్శకులు అజయ్, అతుల్ లో కంపోజ్ చేసిన ఈ సాంగ్ నుంచి చిన్న బిట్ ని మేకర్స్ విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక దీనికి ఫుల్ వెర్షన్ ని ఎట్టకేలకి నేడు విడుదల చేయగా దీనికి ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ రెస్పాన్స్ వస్తుంది. సాంగ్ తో పాటుగా విజయ్, రష్మికల నడుమ కెమిస్ట్రీ కూడా మంచి హైలైట్ గా నిలిచింది. దీనితో ఆడియెన్స్, ఫ్యాన్స్ ఈ సాంగ్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

అలాగే ఇదే లిరికల్ లో తెలుగు సాహిత్యాన్ని కూడా హైలైట్ చేస్తూ అక్షరాల్లో చూపించడం ఓ అరుదైన విషయం అని చెప్పొచ్చు. ఈ మధ్య కాలంలో ఏ తెలుగు సినిమా లిరికల్ వీడియో సాంగ్ లో కూడా ఇలాంటిది ఉండట్లేదు. ఇక ఈ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తుండగా ఈ అక్టోబర్ 16న పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతుంది.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు