‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్ ఏమైనట్టు?

‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్ ఏమైనట్టు?

Published on Sep 22, 2026 2:30 PM IST

బాలీవుడ్ సినిమా నుంచి ఇటీవల వచ్చి సంచలన విజయం సాధించిన చిత్రమే ‘హనుమాన్ అంశ్’. ఒక డివోషనల్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం ఊహించని వసూళ్లు సాధించి ఇండియా వైడ్ గా ట్రెండింగ్ టాపిక్ గా నిలిచింది. కేవలం 2 కోట్ల బడ్జెట్ తో నిర్మాణం వహించిన ఈ సినిమా ఇప్పుడు 350 కోట్ల మార్క్ దిశగా దూసుకెళ్తుంది.

ఇక ఈ సినిమా సాధించిన సక్సెస్ తో మన తెలుగు ఆడియెన్స్ కూడా ఈ సినిమా పట్ల ఆసక్తి చూపించడంతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముందుకొచ్చి తెలుగు వెర్షన్ విడుదల అనౌన్స్ చేశారు. కానీ చివరి నిమిషంలో ఈ సినిమా వాయిదా పడింది. పైగా ఆ సినిమా నుంచి త్రివిక్రమ్ తప్పుకున్నారు అని కూడా వినిపించింది.

ఇక అక్కడ నుంచి ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్ పై ఎలాంటి చప్పుడు లేదు. సో తెలుగులో ఈ సినిమా విడుదల ఇక లేనట్టే అని అనుకోవాలి. మరి ఓటిటిలో అయినా ఉంటుందేమో చూడాల్సిందే. ఇక ఈ చిత్రాన్ని విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించగా శోబినా సత్య ప్రధాన పాత్రలో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు