టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా రామ్ స్వీయ దర్శకత్వంలోనే ఓ సాలిడ్ యాక్షన్ సినిమా ఇప్పుడు చేస్తున్న సంగతి తెలిసిందే. మంచి హైప్ ఉన్న ఈ సినిమా షూటింగ్ ని రామ్ శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. ఒకపక్క నటిస్తూనే, దర్శకత్వం వహిస్తూ చేస్తున్న ఈ సినిమా లేటెస్ట్ గా రెండో షెడ్యూల్ పూర్తి చేసుకున్నట్టు ఓ వీడియో మేకింగ్ ప్రోమో విడుదల చేశారు.
పూర్తిగా రాత్రి షూట్ ని యాక్షన్ పార్ట్ ని పూర్తి చేస్తున్నట్టుగా తెలిపారు. ఇక ఇందులో రామ్ లుక్ కూడా కనిపించింది. కొంచెం లాంగ్ హెయిర్ లుక్ లో రామ్ ఇందులో కనిపిస్తున్నాడు. తన రెడ్ సినిమాలోలా మొత్తం గడ్డంతో కూడా ఉన్నాడు. దీనితో తన లుక్ కూడా వైరల్ గా మారింది. ఇక ఈ యాక్షన్ ప్రాజెక్ట్ కి సామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే కృష్ణ పోతినేని నిర్మాణం వహిస్తున్నారు. దాదాపు ఈ ఏడాదిలోనే సినిమా విడుదలకి ప్లాన్ చేస్తున్నారు.
A new neo-noir vision.
A canvas built on ambition.
A spectacle taking shape. ❤️🔥#RAPO23 Second Schedule Wrapped Up!Written & Directed by #𝙍𝘼𝙋𝙊
Produced by Krishna Pothineni
A @RAPO_Cinematics Production.Energetic Star @ramsayz 🐺🖤… pic.twitter.com/Sy0PhRgOUC
— RAPO Cinematics (@RAPO_Cinematics) September 22, 2026


