చిరంజీవి రక్తం అమ్ముకున్నాడా? వాటిపై సమాధానం వచ్చింది!

చిరంజీవి రక్తం అమ్ముకున్నాడా? వాటిపై సమాధానం వచ్చింది!

Published on Sep 23, 2026 1:00 AM IST

తెలుగు సినిమా దిగ్గజ హీరోస్ లో ఒకరైన మెగాస్టార్ చిరంజీవి తన ఇన్నేళ్ల జీవితంలో చూడని హై మూమెంట్ లేదు అలానే చూడని లో మూమెంట్ కూడా లేదు. ఎంతో పీక్ స్టార్డం ఉన్న సినీ కెరీర్ నుంచి రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత చిరంజీవిపై వచ్చిన ఆరోపణలు కూడా అన్నీ ఇన్ని కాదు.

అలాంటి కొన్ని దారుణ ఆరోపణల్లో చిరు తన రక్త నిధి ద్వారా అభిమానులు, పంచిన రక్తాన్ని అమ్ముకున్నాడు అనే షాకింగ్ ఆరోపణలు కూడా ఒకటి. అయితే ఈ తరహా ఆరోపణలపై ఏనాడు అంత సీరియస్ గా స్పందించని మెగాస్టార్ తాజాగా వాటిపై సమాధానం ఇచ్చారు. తాను రక్తం అమ్ముకున్నాను అని ఆరోపించిన వారిని మూర్ఖులుగా మెగాస్టార్ పరిగణించారు.

అసలు తనకి వచ్చి రెమ్యునరేషన్ తో పోల్చుకుంటే ఎన్ని రక్తం ప్యాకెట్లు అమ్ముకుంటే వాటికీ సమానం అవుతుంది అని లాజిక్ తో సమాధానం ఇచ్చారు. దీనితో తన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారడమే కాకుండా తనపై ఈ కామెంట్స్ చేసినవారికి కూడా చెంపపెట్టుగా నిలిచాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు