సాలిడ్ స్టార్ట్ తో ‘ది ప్యారడైజ్’ బుకింగ్స్!

సాలిడ్ స్టార్ట్ తో ‘ది ప్యారడైజ్’ బుకింగ్స్!

Published on Sep 23, 2026 7:02 AM IST

నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ భారీ సినిమానే ది ప్యారడైజ్. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తీసిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ టాలీవుడ్ లో మరో భారీ హైప్ తో కూడిన సినిమాగా వస్తుంది అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా ఫైనల్ గా నేడు గ్రాండ్ ప్రీమియర్స్ తో మొదలు కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుకింగ్స్ కూడా అంతే సాలిడ్ గా మొదలయ్యాయి.

ఒక్క బుక్ మై షో బుకింగ్స్ లోనే నాని సినిమా గత 24 గంటల్లో 3 లక్షల 21 వేల టికెట్స్ కి పైగా సేల్ చేసుకొని అదరగొట్టింది. ఇది కేవలం ఆరంభం మాత్రమే కాగా అసలు ధమాకా రేపటి నుంచి ఉంటుంది అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఎస్ ఎల్ వి సినిమాస్ నిర్మాణం వహించిన ఈ సినిమా గ్రాండ్ గా రేపు పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు