‘అనిమల్ 2’కి ముందే మరో అనిమల్ ని చూపించేలా ఉన్న రణబీర్ కపూర్!

‘అనిమల్ 2’కి ముందే మరో అనిమల్ ని చూపించేలా ఉన్న రణబీర్ కపూర్!

Published on Sep 24, 2026 1:05 PM IST

బాలీవుడ్ సూపర్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా నటించిన భారీ విజువల్ ట్రీట్ చిత్రం ‘రామాయణ’ ఈ ఏడాది దీపావళి కానుకగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత వచ్చే ఏడాది రామాయణ పార్ట్ 2 కూడా ఉంది ఆ తర్వాత అనిమల్ పార్ట్ 2 కూడా చేయాల్సి ఉంది. అయితే రామాయణ పార్ట్ 2 కంటే ముందే రణబీర్ కపూర్ మరో క్రేజీ ప్రాజెక్ట్ ని రిలీజ్ కి తీసుకురాబోతున్నాడు.

బాలీవుడ్ ప్రముఖ దర్శక, నిర్మాత సంజయ్ లీలా భన్సాలి తెరకెక్కిస్తున్న సాలిడ్ చిత్రం ‘లవ్ అండ్ వార్’. ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా వదిలిన ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రం మాస్ ఆడియెన్స్ కి రణబీర్ ఫ్యాన్స్ కి సూపర్ కిక్ ఇస్తుంది అని చెప్పవచ్చు. అనిమల్ సినిమాలోనే రణబీర్ మాస్ యాంగిల్ ని చూసిన ఫ్యాన్స్ మళ్ళీ అనిమల్ 2 తోనే మాస్ రణబీర్ ని చూస్తాం అనుకున్నారు.

కానీ ఇప్పుడు లవ్ అండ్ వార్ నుంచి వదిలిన పోస్టర్ తో ఈసారి భన్సాలీ సాబ్ డిఫరెంట్ గా ట్రై చేస్తున్నారని అర్ధం అవుతుంది. చేతికి గాయంతోనే యాటిట్యూడ్ తో కార్ డ్రైవ్ చేస్తూ సీరియస్ లుక్ లో రణబీర్ ని ప్రెజెంట్ చేశారు. తన హిస్టారికల్ సినిమాలు నుంచి ఈ సరికొత్త సర్ప్రైజ్ బాలీవుడ్ సహా వారిపై ఐడియా ఉన్నవారిని ఆశ్చర్యపరిచింది. సో మొత్తానికి అనిమల్ 2 రాకముందే రణబీర్ మరో మాస్ ట్రీట్ ఇచ్చేలా ఉన్నాడని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రంలో ఆలియా భట్, విక్కీ కౌశల్ తదితరులు నటిస్తుండగా వచ్చే ఏడాది జనవరి 21న విడుదల కాబోతుంది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు