నాచురల్ స్టార్ నాని హీరోగా యంగ్ హీరోయిన్ కయాదు లోహర్ హీరోయిన్ గా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన భారీ చిత్రమే ది ప్యారడైజ్. మంచి అంచనాలు నడుమ గ్రాండ్ గా నేడు విడుదల అయ్యింది. అయితే ఈ సినిమాలో అనేకమంది స్టార్ నటీనటులు ఉన్నారు. కానీ సరిగా రిలీజ్ ముందు మరిన్ని పాత్రలు సర్ప్రైజ్ చేస్తాయి అని టాక్ బయటకి వచ్చింది.
మరి వీటిలో ఓ యువ నటుడు ఒక ఊహించని పాత్రలో కనిపించి సర్ప్రైజ్ చేయడం వైరల్ గా మారింది. అతడే టాలెంటెడ్ నటుడు, హీరో ప్రియదర్శి. ప్యారడైజ్ లో ప్రముఖ తెలంగాణ పొలిటిషన్ పాత్రలో ప్రియదర్శి కనిపించి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చాడు. దీనితో ప్రీమియర్స్ పూర్తయిన తర్వాత నుంచే ఈ టాక్ బయటకి వచ్చేసింది. దీనితో ప్రియదర్శి మరోసారి తనలోని వెర్సటాలిటీ ప్రదర్శించాడు అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా ఎస్ ఎల్ వి సినిమాస్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.


