సోషల్ మీడియాలో విమర్శలు, ట్రోలింగ్ రోజురోజుకూ మరీ తీవ్రంగా మారుతున్నాయి. నాని ‘ప్యారడైజ్’ విషయంలో ట్రాక్ రికార్డును కూడా చూడకుండా దారుణంగా అటాక్ చేసినప్పటికీ, సినిమా ఏకంగా రూ.140 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఆ ట్రోల్స్‌కు చెక్ పెట్టింది. ఇప్పుడు ఇదే తరహా నెగెటివిటీని విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘రణబాలి’ పై చూపించేందుకు కొన్ని వర్గాలు కాచుకుని కూర్చున్నాయి. గతంలో ‘లైగర్’, ‘ఫ్యామిలీ స్టార్’ సమయాల్లో విజయ్ చేసిన ఓవర్ ఎలివేషన్ కామెంట్సే ఈ పరిస్థితికి కారణమవ్వగా, ఈసారి టీమ్ ఎలాంటి బిల్డప్ లేకుండా చాలా సెటిల్డ్‌గా, బోర్డర్ దాటకుండా ప్రమోషన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
రిలీజ్‌కు మరో 18 రోజులు మాత్రమే సమయం ఉండటంతో పోస్ట్ ప్రొడక్షన్, పబ్లిసిటీ పనులను రాహుల్ సాంకృత్యన్ బృందం వేగవంతం చేసింది. పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలసి నటిస్తున్న మొదటి సినిమా కావడం దీని ప్రత్యేకత. పోటీగా వారం ముందు ‘ఆదర్శ కుటుంబం’, ఒకరోజు ముందు ‘జైలర్ 2’ వంటి భారీ చిత్రాలు ఉన్నప్పటికీ, రణబాలి టీమ్ మాత్రం కంటెంట్‌పై గట్టి నమ్మకంతో ఉంది. ఇప్పటికే టీజర్‌తో మెప్పించిన ఈ చిత్రం, ట్రైలర్‌తో కూడా ఆకట్టుకుంటే బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడం నల్లపూస ఏమీ కాదు.


