మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది. ట్రేడ్ అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం సుమారు రూ. 250 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఘన విజయాన్ని అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 194 కోట్లు రాబట్టిన ఈ సినిమా, ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమయ్యాక రన్ కాస్త తగ్గడంతో రూ. 200 కోట్ల మైలురాయిని మిస్ చేసుకుంది.
కలెక్షన్ల కంటే కూడా ఈ సినిమా సాధించిన ఫుట్‌ఫాల్స్ సరికొత్త రికార్డును సృష్టించాయి. ఏపీ/తెలంగాణలో ‘ఇరుముడి’ దాదాపు 1.45 కోట్ల టిక్కెట్లను విక్రయించింది. సాధారణ టికెట్ ధరలతోనే రిలీజ్ అయినప్పటికీ, భారీ రేట్లతో వచ్చిన ‘పుష్ప 2’ (1.50 కోట్ల టిక్కెట్లు) స్థాయికి అత్యంత సమీపంలోకి వెళ్లడం విశేషం. రూ. 250 కోట్ల వసూళ్లు, భారీ టికెట్ సేల్స్‌తో బాక్సాఫీస్ వద్ద రవితేజ తన మాస్ స్టామినాను మరోసారి చాటిచెప్పారు.


