సూపర్‌స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ‘జైలర్ 2’ దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదల కానుంది. ప్రమోషన్లలో భాగంగా త్వరలోనే ఆల్బమ్ లాంచ్‌తో పాటు అక్టోబర్ 5న థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసేందుకు చిత్రబృందం సిద్ధమైంది.
అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ భారీ చిత్రంలో రమ్యకృష్ణ, విద్యాబాలన్ ముఖ్య పాత్రలు పోషిస్తుండగా.. మోహన్‌లాల్, హృతిక్ రోషన్, శివ రాజ్‌కుమార్, విజయ్ సేతుపతి ప్రత్యేక కామియోల్లో మెరవనున్నారు.


