‘ఆదర్శకుటుంబం’ అసలు పరీక్ష ఇదే..!

‘ఆదర్శకుటుంబం’ అసలు పరీక్ష ఇదే..!

Published on Sep 29, 2026 1:34 AM IST

వెంకటేష్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం ఏకె 47’ సినిమాకు ఆశించిన స్థాయిలో బజ్ కనిపించడం లేదు. ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ లాంటి మ్యాజిక్ రిపీట్ అవుతుందని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నప్పటికీ.. వరుస వాయిదాలు, సుదీర్ఘమైన షూటింగ్ గ్యాప్‌ల కారణంగా సినిమాపై క్రమంగా హైప్ తగ్గుతూ వచ్చింది.

​ఇటీవల వచ్చిన కొత్త టీజర్ పర్వాలేదనిపించినా, కథపై వస్తున్న రూమర్లు ఈ సినిమాకు కొంత ప్రతికూలంగా మారాయి. దసరా బరిలో రజనీకాంత్ ‘జైలర్ 2’, విజయ్ దేవరకొండ ‘రణబాలి’ లాంటి భారీ చిత్రాల నుంచి గట్టి పోటీ ఉండటంతో, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద గట్టెక్కాలంటే కచ్చితంగా ‘బ్లాక్‌బస్టర్’ టాక్ రావడం అత్యంత కీలకం.

తాజా వార్తలు