‘దాదా’ రిలీజ్ పై సందేహాలు.. పండగ బరిలో వస్తాడా లేదా..?

‘దాదా’ రిలీజ్ పై సందేహాలు.. పండగ బరిలో వస్తాడా లేదా..?

Published on Sep 29, 2026 1:01 AM IST

క్రిస్మస్ రేసులో ఉన్న బాలకృష్ణ ‘దాదా’ చిత్రం అనుకున్న సమయానికి రావడంపై ఫిలిం నగర్ వర్గాల్లో తీవ్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య హెల్త్ రెస్ట్ ముగించుకుని ఇంకా సెట్స్‌లో అడుగుపెట్టకపోవడమే దీనికి ప్రధాన కారణం. దసరా నుంచి షూటింగ్ పునఃప్రారంభమయ్యే సూచనలు ఉన్నప్పటికీ, మరింత ఆలస్యమైతే మాత్రం ఈ సినిమాను సంక్రాంతికి వాయిదా వేయడం మినహా ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మంచు మనోజ్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

​అయితే, ఈసారి సంక్రాంతి బరి ఇప్పటికే ఊహించని రేంజ్‌లో నిండిపోయింది. చిరంజీవి ‘కాకా’, వెంకటేష్-కళ్యాణ్ రామ్ చిత్రం, ప్రశాంత్ వర్మ ‘మహాకాళి’, సాయి దుర్గ తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’, శర్వానంద్ ‘జార్జ్ క్రిష్’, శ్రీవిష్ణు ‘ఫ్యామిలీ ప్యాక్’లతో పాటు రజనీకాంత్ ‘ధర్మన్’ కూడా పోటీలో ఉన్నాయి. ఇన్ని క్రేజీ సినిమాల మధ్య ‘దాదా’ కూడా సంక్రాంతికే వస్తే థియేటర్ల కేటాయింపు విషయంలో బాక్సాఫీస్ దగ్గర గట్టి రసాభాసే జరిగేలా ఉంది.

తాజా వార్తలు