సుకుమార్ శిష్యుడు ఆ సెంటిమెంట్ బ్రేక్ చేస్తాడా..?

సుకుమార్ శిష్యుడు ఆ సెంటిమెంట్ బ్రేక్ చేస్తాడా..?

Published on Sep 29, 2026 2:16 AM IST

దర్శకుడు సుకుమార్ శిష్యులు తొలి చిత్రాలతోనే సంచలనం సృష్టిస్తున్నప్పటికీ, వారి రెండో సినిమాలు మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాయి. ‘ఉప్పెన’తో అదరగొట్టిన బుచ్చిబాబు, రామ్ చరణ్‌తో చేసిన ‘పెద్ది’తో తీవ్రంగా నిరాశపరచగా.. తాజాగా ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కూడా నానితో తీసిన ‘ది ప్యారడైజ్’ చిత్రంలో మితిమీరిన హింస, కథనంలో లోపాల వల్ల ఘోరమైన పరాజయాన్ని మూటగట్టుకున్నారు.

​ఇప్పుడు అందరి దృష్టి సుకుమార్ మరో అసిస్టెంట్ కార్తీక్ దండుపై పడింది. ‘విరూపాక్ష’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఆయన నాగచైతన్యతో ‘వృషకర్మ’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మంచి బజ్ ఉన్న ఈ సినిమాతో కార్తీక్ అయినా ఆ ‘రెండో సినిమా సెంటిమెంట్’ను అధిగమించి విజయం సాధిస్తారో లేదో వేచి చూడాలి.

తాజా వార్తలు