Subscribe to our Youtube Channel
 
Like us on Facebook
 
ఇంటర్వ్యూ : బెల్లంకొండ సురేశ్ – ‘రాక్షసుడు’ని పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు నా కృతజ్ఞతలు !
Published on Aug 5, 2019 5:25 pm IST

బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా రమేష్ వర్మ దర్శకత్వంలో వచ్చిన “రాక్షసుడు”చిత్రం విడుదలై మంచి పాజిటివ్ టాక్ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ చిత్రం అనిపించుంకుంది. ఈ సందర్భంగా బెల్లంకొండ శ్రీనివాస్ తండ్రి నిర్మాత బెల్లంకొండ సురేశ్ మీడియాతో మాట్లాడారు. ఆయన వెల్లడించిన పలు ఆసక్తికర విశేషాలు మీ కోసం…

బెల్లంకొండ శ్రీనివాస్ కి “రాక్షసుడు” రూపంలో సూపర్ హిట్ వచ్చింది. మీకెలా అనిపిస్తోంది ?

బెల్లంకొండ శ్రీనివాస్ మొదటి సినిమా.. వివి వినాయక్, సమంత వంటి స్టార్స్ కాంబినేషన్ లో గ్రాండ్ గా తెరకెక్కించడం జరిగింది. ఆ మూవీ 34కోట్ల షేర్ వరకు సాధించింది. అలాగే బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన జయజానకి నాయక భారీ క్యాస్టింగ్, బడ్జెట్‌తో రూపొందింది. అవన్నీ డైరెక్టర్‌ కి, ఇతర క్యాస్టింగ్‌ కి పేరుని తెచ్చిపెట్టాయి. కానీ రాక్షసుడు సినిమా మాత్రం మా అబ్బాయి బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కి చాలా మంచి పేరు తీసుకొచ్చింది. సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. శ్రీనివాస్ కి ఈ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు.

అయితే బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ పట్ల మీరు పూర్తి సంతృప్తిగా ఉన్నారా ?

నేను నిర్మాతగా కెరీర్ స్టార్ట్ చేసి 21 ఏళ్లవుతుంది. 25 స్ట్రయిట్ సినిమాలు, 8 డబ్బింగ్ సినిమాలను ప్రేక్షకులకు అందించాను. ఇవేవీ నాకు ఆనందాన్ని ఇవ్వలేదు. అలాగే మా అబ్బాయి చేసిన ఆరు సినిమాలు కూడా ఓ ఎత్తైతే.. ఈ సినిమా నాకు మరో ఎత్తు. ముఖ్యంగా ఈ సినిమా ఓవర్‌సీస్‌లోనూ విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. శనివారం 85 శాతం అక్యుపెన్సీ అవ్వగా.. ఆదివారం నాటికి 100 శాతం అక్యుపెన్సీ అయింది. శ్రీనివాస్ కెరీర్ పట్ల చాల సంతోషంగా ఉన్నాను.

ఈ సినిమా విజయంలో రాక్షసుడు టీం కీలక పాత్ర పోషించింది ?

అవును. ముందుగా మా అబ్బాయితో ఈ సినిమా చేసినందుకు కొనేరు సత్యనారాయణగారికి ఈ సందర్భంగా నా ధన్యవాదాలు. ఈ రోజుల్లో రీమేక్ చేయడం చాలా కష్టం. రమేశ్ వర్మ సినిమాను తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా ఎలాంటి మార్పులు చేయకుండా అద్భుతంగా తెరకెక్కించారు. టెంపోను ఎక్కడా మిస్ కాలేదు. కెమెరామెన్ వెంకట్‌కి హ్యాట్సాఫ్. శ్రీనివాస్‌ను చాలా హ్యాండ్‌సమ్‌గా చూపించారు. మా అబ్బాయి గత చిత్రాలను మరచిపోయేలా ఈ సినిమా ఉంది.

బెల్లంకొండ శ్రీనివాస్‌ సినిమాలను యూట్యూబ్‌ లో హిందీ ప్రేక్షకులూ బాగా ఆదరిస్తున్నారుగా ?

అవును. యూట్యూబ్‌ లో హిందీలో సౌత్‌లోనే నెంబర్ వన్ హీరోలాంటి సినిమాలు ఉన్నాయంటే బెల్లంకొండ శ్రీనివాస్‌ దే. స్పీడున్నోడు 200 మిలియన్స్ దాటింది. జయజానకినాయక 140 మిలియన్స్ దాటి రన్ అవుతోంది. కవచం సినిమా 120 మిలియన్స్ దాటింది. అల్లుడు శీను లేట్‌గా టెలికాస్ట్ అయినా 100 మిలియన్ దగ్గర వ్యూస్ చేరుకుంది. సౌత్‌లో 400 మిలియన్, రెండు టు హండ్రెడ్ మిలియన్ దాటిన సినిమాలు చేసిన హీరో శ్రీనివాసే. హిందీలో, శాటిలైట్ పరంగా మా సినిమాలు అత్యద్భుతమైన ఆదరణను పొందుతున్నాయి.

రాక్షసుడు సినిమా విషయానికి వస్తే సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేశారు ?

కొనేరు సత్యనారాయణగారు, అభిషేక్ పిక్చర్స్ అభిషేక్ నామాగారికే ఆ క్రెడిట్ దక్కుతుంది. ముఖ్యంగా ఓవర్‌సీస్‌లో 100 స్క్రీన్స్‌ వేశారు. అప్పుడు సాంబయ్య సినిమాకు ఎలాగైతే నన్ను ప్రేక్షకులు ఆదరించారో.. ఇప్పుడు మా అబ్బాయిని అలా ఆదరిస్తున్నారు. సోమవారం రోజున కలెక్షన్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమా నుండి మా అబ్బాయి ప్రతి సినిమాకు జర్నలిస్ట్ అసోసియేషన్‌ కు రూ.10 లక్షలను ఇవ్వాలని నిర్ణయించుకున్నాను.

బెల్లంకొండ శ్రీనివాస్‌ కి హిందీ సినిమా ఛాన్స్ వచ్చిందట ?

అవును. ఒక బాలీవుడ్‌కి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ మా అబ్బాయితో సినిమా చేస్తామని, మమ్మల్ని కలవడానికి హైదరాబాద్ వస్తామని చెబుతూ మెయిల్ పంపారు. అంత గొప్ప సంస్థ నుండి అవకాశం రావడం గొప్పగా భావిస్తున్నాం. అలాగే దిల్‌రాజు బ్యానర్‌లో ఓ సినిమాను శ్రీనివాస్ చేస్తున్నాడు.

మరి మీ నిర్మాణంలో మీ తదుపరి సినిమాలు గురించి ?

వచ్చే ఏడాది నేను కూడా మా అబ్బాయితో ఓ సినిమా చేయబోతున్నాను. అలాగే తెలుగులో విజయవంతమైన ఓ చిత్రాన్ని బాలీవుడ్‌లో నేనే నిర్మాతగా మారి రీమేక్ చేయాలనుకుంటున్నాను.


సంబంధిత సమాచారం :