ఇంటర్వ్యూ: హరీష్ శంకర్-ఆ విషయంలో ఎన్టీఆర్ కి రుణపడి ఉన్నాను.

ఇంటర్వ్యూ: హరీష్ శంకర్-ఆ విషయంలో ఎన్టీఆర్ కి రుణపడి ఉన్నాను.

Published on Sep 16, 2019 4:56 PM IST

వరుణ్ తేజ్ ,పూజా హెగ్డే ప్రధాన పాత్రలో దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన చిత్రం వాల్మీకి . హరీష్ శంకర్ వరుణ్ ని వాల్మికీలో ఊర మాస్ గ్యాంగ్ స్టర్ గా ప్రజెంట్ చేయనున్నారు. ఈనెల 20న వాల్మీకి ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఈ సందర్భంగా హరీష్ శంకర్ పాత్రికేయుల సమావేశంలో పాల్గొని చిత్ర విశేషాలు పంచుకున్నారు.

 

వాల్మీకి టైటిల్ పెట్టడానికి గల కారణమేమిటి?

ఒక మనిషిలో వచ్చే గొప్ప మార్పుకి వాల్మీకి కి మించిన గొప్ప ఉదాహరణ మరొకరు ఉండదు. అందుకే ఈ మూవీకి వాల్మీకి అని టైటిల్ పెట్టడం జరిగింది. ఈ మూవీ కథకు ఆధారమే ఆ పాయింట్. ఆ విషయాన్ని ఈ చిత్రంలో చక్కగా వివరించడం జరిగింది.

 

వాల్మీకి టైటిల్ పై అనేక వివాదాలు వచ్చాయి, వాటిపై మీ స్పందన ఏమిటీ?

ఆ విషయం కోర్టులో నడుస్తుంది. విచారణలో ఉన్న విషయాల గురించి మనం బయట మాట్లాడుకోకూడదు. ఆ లీగల్ విషయాలు మా ప్రొడ్యూసర్స్, లాయర్స్ చూసుకుంటున్నారు. టైటిల్ అనేది నిర్మాతలు రిజిస్టర్ చేయించుకుంటారు. డైరెక్టర్స్ కేవలం కథ, స్క్రిప్ట్ మాత్రమే రిజిస్టర్ చేయించుకోవడం జరుగుతుంది.

 

వాల్మీకి చిత్రం ఎలా కార్యరూపం దాల్చింది?

షుమారు ఏడాది క్రితం రజిని, కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్ లో పేట మూవీ అనౌన్స్మెంట్ జరిగింది. అప్పుడే కార్తీక్ సుబ్బరాజ్ చేసిన జిగర్తాండ మూవీ చాలా బాగుంటుందిగా కదా, ఆ చిత్రం రీమేక్ ఎందుకు చేయకూడదు అనే ఆలోచన వచ్చింది. ఆ చిత్రం చూశాక సిద్దార్థ్ పాత్ర కంటే విలన్ గా చేసిన బాబీ సింహ పాత్ర నాకు బాగా నచ్చింది. ఆపాత్ర ప్రధానంగా స్క్రిప్ట్ రాసుకొని తీస్తే బాగుంటది కదా అనే ఆలోచన నాకు అప్పుడు కలగడం జరిగింది.

 

గబ్బర్ సింగ్ మూవీలా వాల్మీకి చిత్రం కూడా ఒరిజినల్ చిత్రం కి పొంతన లేకుండా ఉంటుందా?

గబ్బర్ సింగ్ చిత్రం అంటే పవన్ కళ్యాణ్ స్టార్ డమ్ రీత్యా ఆయన బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా చాలా మార్పులు చేయడం జరిగింది. కానీ జిగర్తాండ మూవీ మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కిన చిత్రం. ఆ చిత్ర దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ పై, అలాగే ఆయన సినిమాపై, మ్యూజిక్ సెన్స్ పై నాకు చాలా గౌరవం వుంది. కాకపోతే వరుణ్ చేసిన పాత్ర చేసిన బాబీ సింహ అక్కడ క్యారెక్టర్ ఆర్టిస్ట్, కానీ వరుణ్ హీరో అందుకే కొన్ని మార్పులు చేయడం జరిగింది. చాలా సన్నివేశాలు ఒరిజినల్ మూవీలో లానే తెరకెక్కించాం.

 

పూజా పాత్ర గురించి చెవుతారా?

పూజా పాత్ర ఆమె ఎపిసోడ్ కొంచెం సస్పెన్స్ అండి. ఆమె సెకండ్ హాఫ్ లో వస్తుంది. ఆమెతో ఒక పాట, కొన్ని సన్నివేశాలు కాన్సెప్ట్ లో భాగంగా ఉంటాయి. కథలో భాగంగా ఉండాలనే శ్రీదేవి,శోభన్ బాబుల సాంగ్ తీసుకోవడం జరిగింది.

 

సిద్ధార్ద్ పాత్ర కోసం అధర్వను తీసుకోవడానికి కారణం ఏమిటి?

తెలుగులో కూడా చాలా మంది యంగ్ స్టర్స్ ఉన్నారు. కానీ వారికి గత చిత్రాల వలన ఎదో ఒక ఇమేజ్ అనేది ఉంటుంది. అలా ఉంటే కొన్ని సన్నివేశాలకు వారు సెట్ అవ్వరు అనే భావనతో తెలుగు వారికి అంతగా పరిచయం లేని అధర్వను తీసుకోవడం జరిగింది.

 

శ్రీదేవి,శోభన్ బాబు పాటను రీమిక్స్ చేశారు కదా, ఆపాట ఎలా తెరకెక్కించారు?

పూర్తిగా అప్పటి వాతావరణం ప్రతిబింబించేలా ఆ పాటను చిత్రీకరించడం జరిగింది. పాటలోని ట్యూన్ నుండి, సెట్స్ వరకు అన్ని పాత పాటకు చాలా దగ్గరగా ఉంటాయి. పాత పాటను చెడగొట్టాం అనే ఫీలింగ్ ఎవరికీ రాకుండా తెరకెక్కించాం.

 

నితిన్ హీరోగా హిందీ చిత్రం అందాదున్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి?

నితిన్ కలిసి ఆ చిత్రం చేయాలనుకుంటున్నాని చెప్పడం జరిగింది. మంచి చిత్రం చేయండి అన్నాను. అంతకు మించి ఈ విషయంలో జరిగింది ఏమిలేదు.

 

దిల్ రాజుతో మీకు అభిప్రాయ భేదాలు వచ్చాయట కదా?

అవి అభిప్రాయం భేదాలు కాదండి కేవలం, క్రీయేటివిటీ భేదాలు మాత్రమే. ఒక చిత్రం విషయంలో నటీనటుల విషయంలో మా అభిప్రాయాలు కలవలేదు. అంతే కానీ అదేమీ గొడవ కాదు. మా చిత్రం వాల్మీకి వైజాగ్ ఏరియా ఆయనే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.

 

మహేష్ కోనేరుతో ఓ మూవీ మీరు చేస్తున్నారట కదా?

అవునండీ…,చర్చల దశలో ఉంది. త్వరలో మూవీ చేసే అవకాశం కలదు.

 

పవన్ తో గబ్బర్ సింగ్ 3 ఉంటుందని పుకార్లు వస్తున్నాయి?

అలా జరగాలని మీరు కోరుకోండి. నేను కూడా పవన్ కళ్యాణ్ గారితో మళ్ళీ చిత్రం చేయాలనీ ఎంతగానో కోరుకుంటున్నాను.

 

ఇండస్ట్రీలో ఎవరికైనా రుణపడ్డానన్న భావన కలిగిందా?

అవునండి ఎన్టీఆర్ గారికి చాలా ఋణ పడివున్నాను. ఆయన నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకోలేకపోయాను. ఎప్పటికైనా ఆయనతో మంచి హిట్ మూవీ తీసి ఋణం తీర్చుకోవాలి.

 

ప్రభాస్ తో మూవీ చేస్తారా?

ప్రభాస్, మహేష్ లాంటి హీరోలతో మూవీస్ చేసే అవకాశం వస్తే ఎవరు మాత్రం వద్దంటారు చెప్పండి. అనేక చోట్ల ఫ్యాన్స్ అడుగుతుంటారు. కానీ బాహుబలి లాంటి సినిమా తీయాలని మనం అనుకుంటే జరగదు, దానంతటికదే అది జరగాలి.

 

చివరిగా వరుణ్ ఫ్యాన్స్ కి ఏమిచెవుతారు?

వరుణ్ ఫ్యాన్స్ వాల్మికీలో ఆయన నట విశ్వరూపం చూస్తారు. నేను అనుకున్నదానికి, రాసుకున్నదానికి మించి అద్భుతంగా నటించారు. ఈ మూవీ ఎన్ని కోట్ల వసూళ్లు సాధిస్తుందో తెలియదు కానీ, మా ఇద్దరి కాంబినేషన్ లో బెస్ట్ మూవీ గా మిగిలిపోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు