ప్రత్యేక ముఖాముఖి : నా ఇష్టం లో పాత్రకు రవితేజ స్ఫూర్తి : రానా

ప్రత్యేక ముఖాముఖి : నా ఇష్టం లో పాత్రకు రవితేజ స్ఫూర్తి : రానా

Published on Mar 14, 2012 7:10 AM IST


రానా దగ్గుబాటి, ప్రస్తుతం పరిశ్రమ లో ఉన్న అందమయిన హీరోలలో ఒకరు తెలుగులోనే కాదు బాలోవుడ్ లో కూడా తనదయిన ముద్ర వేస్తున్న కథానాయకుడు. త్వరలో “నా ఇష్టం ” మరియు రామ్ గోపాల్ వర్మ “డిపార్ట్మెంట్” చిత్రాలలో రానా కనపడబోతున్నారు. మా విలేకరి తన ఆఫీస్ లో తన ఇంటర్వ్యూ తీసుకున్నారు మీ కోసం ఆ సంభాషణ.

ప్ర)ఈ వేసవి కి మీ రెండు చిత్రాలు “నా ఇష్టం” మరియు “డిపార్ట్మెంట్” విడుదల ఉన్నాయి కదా వాటి మీద మీకున్న అంచనాలు?
జ) పాత్రల తీరుతెన్నులు ప్రకారం రెండు చిత్రాలు విభిన్నంగా ఉంటాయి రెండు చిత్రాలు నేను చాలా ఎంజాయ్ చేస్తూ చేసాను రెండు చిత్రాలు కూడా చాలా బాగా వచ్చాయి వాటి ఫలితాల కోసం ఆసక్తిగా వేచి చూస్తున్న. నా ఇష్టం చిత్రం మార్చ్ 23 న విడుదల కానుంది మే మధ్య లో “డిపార్ట్మెంట్” విడుదల కానుంది.

 

ప్ర) “నా ఇష్టం” చిత్రం లో మీ పాత్ర ఎలా ఉండబోతుంది?
జ) నేను గని పాత్రలో కనిపించాబోతున్నాను స్వార్ధపరుడి పాత్ర ,ప్రకాశ్ తోలేటి ఈ పాత్రను అద్బుతంగా మలిచారు ఈ పాత్రలో చేయ్యటాన్ని నేను చాలా ఎంజాయ్ చేస్తూ చేసాను. పశ్చిమ గోదావరి జిల్లా మరియు తెలంగాణా యాసలు మాట్లాడుతాను ఈ పాత్ర చెయ్యటానికి స్ఫూర్తి రవితేజ ఆయనతో ఈ పాత్ర గురించి తరుచుగా మాట్లాడుతూ ఉండేవాడిని.

 

ప్ర) “నా ఇష్టం” చిత్రం లో జెనిలియా పాత్ర నుండి ప్రేక్షకులు ఏం ఆశించవచ్చు?
జ)జెనిలియా చాలా ప్రతిభ ఉన్న నటి ఇప్పటికే తనదయిన నటన తో ఒక ముద్ర వేసింది ఈ చిత్రానికి తన అనుభవం చాలా సహాయపడింది గత చిత్రాలతో పోలిస్తే ఈ చిత్రం లో తన పాత్ర కాస్త విభిన్నంగా ఉండబోతుంది నా పాత్రకు పూర్తి వ్యతిరేకంగా ఉండే పాత్రలో జెనిలియా అద్బుతంగా నటించింది “నా ఇష్టం” చిత్రం ఇద్దరు విభిన్న మనుషుల మధ్య జరిగిన కథ.

ప్ర) నా ఇష్టం చిత్రం మీరు ఎంచుకోటానికి కారణాలేంటి?

జ)జీవితం లో ప్రేమ మరియు ఈర్ష్య అనే రెండు భావాలూ చాలా నిజమయినవి ఈ చిత్రం లో పాత్ర ఈ రెండు నిజాల చుట్టూ తిరుగుతుంది ప్రకాశ్ కథ చెప్పిన విధానం నన్ను ఆకట్టుకుంది 2009 లో నే ప్రకాశ్ ఈ కథను నాకు చెప్పారు. చాలా నచ్చింది అప్పట్లో నాకు నచ్చిన చిత్రాలు రెండు ఒకటి సౌండ్ అఫ్ మ్యూజిక్ మరియు రంగీల ఈ చిత్రాలలో పాత్రలను మలిచిన తీరు నన్ను బాగా ఆకట్టుకుంది నా ఇష్టం చిత్రం లో నా పాత్రకు వేరు వేరు కోణాల్లో వేరు వేరు అభిప్రాయాలు ఉంటుంది వాటి పరిణామాలు ఏంటో అనేది చిత్ర కథ గా మలిచారు.

ప్ర) ప్రతి నటుడికి ఒక ప్రత్యేకత ఉంటుంది, మీరు దేనికి ప్రత్యేకం అని అనుకుంటున్నారు?

జ)నేను దేనికి ప్రత్యేకం కాదు ఒకానొక శైలి కి నేను అలవాటుపదిపోవాలి అనుకోట్లేదు కొన్నేళ్ళ క్రితం దశావతారం డబ్బింగ్ సమయం లో నేను కమల్ గారిని కలిసాను అప్పుడు అయన చెప్పిన విషయం నాకు చాలా స్పూర్తిని ఇచ్చాయి ” పేరు మరియు హోదా మనల్ని మంచి నటులుగా మలుచుకొటానికి ఉన్న అవకాశాలను మూసేస్తాయి అప్పటితో మనం నటించడం ఆపెయచ్చు” అని చెప్పారు. కాబట్టి నా పాత్రకు తగ్గట్టు నేను నన్ను మలుచుకుంటాను నాకు “రానా” చిత్రం అనిపించుకోటం ఇష్టం ఉండదు నేనొక పాత్రలానే గుర్తుండిపొవాలి.
ప్ర) అంటే రానా ఒక నటుడు కాని స్టార్ కాదంటారు అంతేనా?

జ) (నవ్వుతూ) అవును. నాకు నచ్చిన శైలి లో నేను చిత్రాలను చేస్తున్న “లీడర్” రాజకీయ డ్రామా అయితే “డిపార్ట్మెంట్” ఒక పోలీసు థ్రిల్లర్ ఇంకా “నా ఇష్టం” విషయానికి వస్తే రొమాంటిక్ ఎంటర్ టైనర్. ఈ మూడు చిత్రాలలో వేటిలోనూ మరో చిత్రం లో ని పాత్రతో పోలిక ఉండదు. నన్ను నేను నటుడిగా నిరూపించుకునేందుకు కృషి చేస్తున్నాను.

ప్ర)డిపార్ట్మెంట్ చిత్రం ఎలా వచ్చింది?
జ) డిపార్ట్మెంట్ చిత్రం చాలా అద్బుతంగా వచ్చింది. నాన్నగారు మరియు కొందరు పెద్దలు ఈ చిత్రాన్ని ఈ మద్యనే చూసి చాలా ఆనంద పడ్డారు.”డిపార్ట్మెంట్” చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఇందులోని పాత్రలతో కనెక్ట్ అవుతారు. రామ్ గోపాల్ వర్మ గారు పోలీసు డిపార్ట్మెంట్ గురించి క్షుణ్ణంగా పరిశీలించారు ఈ చిత్రం లో తను అన్ని కోణాలను చూపించారు ఈ చిత్రాన్ని 100 రోజులకు పైగా చిత్రీకరించాం

 

ప్ర) ఈ చిత్రం లో మీరు కొన్ని డాన్స్ మూవ్ మెంట్స్ ని ప్రయత్నించినట్టున్నారు వచ్చిన ఫలితం మీకు సంతృప్తిని ఇచ్చిందా?

జ)ఆరడుగుల మనిషి కి డాన్స్ కొరియోగ్రాఫ్ చెయ్యటం అంటే అంత సులువయిన విషయం కాదు. ఈ చిత్రం లో మూవ్ మెంట్స్ చాలా బాగా వచ్చాయి ఏది విరుద్దంగా అనిపించదు నా దేహా పరిస్థితి ని అర్ధం చేసుకొని మూవ్ మెంట్స్ ఇవ్వటం లో ప్రేమ రక్షిత్ అద్బుతమయిన ప్రతిభ కనబరచారు.

 

ప్ర)మీకు నిర్మాణ రంగం లో చాలా అనుభవం ఉంది. రానున్న పది పదిహేనేళ్ళలో సురేష్ ప్రొడక్షన్స్ దేని మీద దృష్టి సారించబోతుంది?

జ)నాకు దేశం లో అత్యుత్తమ నిర్మాణ సంస్థగా సురేష్ ప్రొడక్షన్స్ ని నిలబెట్టాలని ఉంది అన్ని భాషలలో సురేష్ ప్రొడక్షన్స్ చిత్రాలు విడుదల కావాలి గతం లో తాతగారు రామానాయుడు గారు చేసేవారు కాని ఇది ఆగిపోయింది తిరిగి మొదలుపెట్టాలి.

 

ప్ర) చిత్రాలు కాకుండా మీకు ఆసక్తి ఉన్న విషయాలు?
జ) నేను పుస్తకాల పురుగుని. మహాభారతం అంటే చాలా ఇష్టం అందులో ఏడు రకాలు చదివాను.

 

ప్ర) రాబోయే చిత్రాలు ?
జ) సెల్వరాఘవన్ తో తమిళ చిత్రం చేస్తున్నాను. వెట్రిమారన్ తో ఒక చిత్రం చెయ్యాల్సి ఉంది కాని సమయం లేకపోవటం మూలాన చెయ్యలేదు. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వం లో “కృష్ణం వందే జగద్గురు” చిత్రం లో బిజీ గా ఉన్నాను.

 

ప్ర)క్రిష్ చిత్రం లో కథానాయిక ఎవరు?
జ) ఇంకా మాక్కూడా తెలియదు ఇంకా వెతుకుతూనే ఉన్నాం చిత్రం లో కథానాయిక లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. నా లాంటి పొడవయిన మనిషి కి కథానాయికను వెతకటం కష్టం అని క్రిష్ అంటున్నారు.

 

ప్ర) మీరు మీ కండలను ఎప్పుడు చుపించాబోతున్నారు?
జ)(మళ్ళి నవ్వుతూ) “కృష్ణం వందే జగద్గురు” చిత్రం లో ఆ పని చేసాను డిపార్ట్ మెంట్ లో కణాలను చూపించే అవకాశం లేదు.

 

ప్ర) ట్విట్టర్ లో మీరు చాలా తరుచుగా ఉంటారు అలానే పరిశ్రమ లో మీ సన్నిహితులను కూడా ప్రోత్సాహించాచు కదా?

జ) బన్నీ మూడు రోజులు ఉన్నారు తరువాత తనకి నచ్చలేదు అది తన సొంత ఆసక్తి మీద ఆధారపడి ఉంటుంది

 

ప్ర) మీ రాబోయే చిత్రాలకు శుభాకాంక్షలు మేము వాటి కోసం వేచి చూస్తుంటాం

జ)(నవ్వుతూ) థ్యాంక్స్. 123తెలుగు.కాం ప్రేక్షకులకు “హాయ్”

 

దానితో ఇంటర్వ్యూ ముగిసింది రానా తన పని లో తను నిమగ్నమయిపోయారు. మీరు ఈ ఇంటర్వ్యూ ని ఎంజాయ్ చేసుంటారు అని అనుకుంటున్నాం. రానా రాబోయే ప్రాజెక్ట్ లు విజయవంతం అవ్వాలని ఆశిద్దాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు