ఇంటర్వ్యూ :ఆది – నా పోలీస్ స్టోరీ కోసం ఎదురుచూస్తున్నాను..!

Published on May 1, 2020 5:07 pm IST

 

డైలాగ్ కింగ్ సాయి కుమార్ తనయుడిగా చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయమైన ఆది సాయి కుమార్ ప్రేమ కావాలి, లవ్లీ వంటి చిత్రాలతో మంచి హిట్స్ అందుకున్నారు. లాక్ డౌన్ సిరీస్ లో మన నెక్స్ట్ గెస్ట్ గా ఆయన్ని పలకరించి అనేక విషయాలు తెలుసుకోవడం జరిగింది ఆ విశేషాలు మీకోసం…

 

ఎందుకు లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తారు?

ఈ ప్రశ్న చాలా మంది అడుగుతూ ఉంటారు. మీరు సోషల్ మీడియాలో కనిపించరేంది అంటూ ఉంటారు. మన కంటే మన సినిమాలు సందడి చేయాలి, మాట్లాడాలి అనేది నా సిద్ధాంతం. కాకపోతే ట్రెండ్ కి తగ్గట్టుగా నేను మారాలి అనుకుంటున్నాను.

 

మీ వరుస పరాజయాలను గురించి మీరు ఏమంటారు

నేను తక్కువ వయసులోనే చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాను. నా మొదటి రెండు చిత్రాలు బాగా ఆడాయి. నేను యంగ్ ఏజ్ లో ఉండడం వలన అనేక మంది అనేక సలహాలు ఇచ్చేవారు. అలాగే కమర్షియల్ సినిమాలు ట్రై చేశాను. అవి అంతగా వర్క్ అవుట్ కాలేదు. శమంతకు మణి సినిమా వరకు నా సినిమాల పట్ల నా ద్రుష్టి ఒకలా ఉండేది, నా భవిష్యత్ సినిమాలు నా ఇమేజ్ మారుస్తాయని భావిస్తున్నాను.

 

ఓకె..మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి?

వరుసగా నాలుగు సినిమాలు నానుండి రానున్నాయి. వాటిలో జంగిల్ మరియు శశి విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అలాగే మరో రెండు ప్రాజెక్ట్స్ ప్రకటించాల్సి వుంది. జంగిల్ ఒక ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్, శశి ఇంటెన్స్ లవ్ స్టోరీ.

 

మీ కెరీర్ లో ఇన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, నాన్నగారు సాయి కుమార్ పాత్ర ఏమిటీ?

కెరీర్ ప్రారంభంలో నాన్నగారు స్టోరీ సెలక్షన్స్ లో నాకు తోడుగా ఉన్నారు. ఐతే తరువాత నాకు నేనుగా నిర్ణయాలు తీసుకోవాలనే ఆలోచనతో సొంతగా కొన్ని ప్రాజెక్ట్స్ చేయండం జరిగింది. అవి ఫలితాన్ని ఇవ్వలేదు. ఐనా ఇది ఎవరికైనా ఎదురయ్యే సమస్యే. నాన్న గారు కూడా పోలీస్ స్టోరీ లాంటి సినిమా వచ్చే వరకు అనేక ఫెయిల్యూర్స్ చూశారు. నేను నా పోలీస్ స్టోరీ కోసం ఎదురు చూస్తున్నాను.

 

ఇండస్ట్రీలో ఏ దర్శకులతో పని చేయాలనుకుంటున్నారు?

డైరెక్టర్ సందీప్ రెడ్డి టేకింగ్ కి నేను పెద్ద ఫ్యాన్ ని. ఆయనతో మూవీ చేయాలని ఉంది. అలాగే పూరి జగన్నాధ్, శేఖర్ కమ్ముల, మోహన కృష్ణ ఇంద్రగంటి వంటి దర్శకుల చిత్రాలలో నటించాలని ఉంది. నవీన్ పోలిశెట్టి ఒక్క మంచి చిత్రంతో భారీ గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి ఓ దర్శకుడు నాకు కావాలి.

 

చాల తక్కువ వయసులో పెళ్లి చేసుకున్నారు..ఆమె మీకు ఎలాంటి సపోర్ట్ ఇస్తారు?

ప్రతి విషయంలో ఆమె సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుంది. అలాగే నా సినిమాల విషయంలో ఆమె అసలు జోక్యం చేసుకోదు. ఇంత వరకు ఆమె నన్ను బాధపెట్టిన సందర్భం లేదు. ప్రస్తుతం షూటింగ్ లేకపోవడంతో నా కూతురుతో గడుపుతున్నాను. అలాగే నా భార్యకు ఇంటి పనులలో సాయం చేస్తున్నాను.

 

పరిశ్రమలో మీకు మంచి చిత్రులు ఎవరు?

సందీప్ కిషన్ నాకు బాల్య స్నేహితుడు. చిన్నప్పటి నుండి కలిసి పెరిగాం. అలాగే దాదాపు ఒకే సమయంలో కెరీర్ ప్రారంభించాం. ఇద్దరి కెరీర్ లో అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. కెరీర్ కి బూస్ట్ ఇచ్చే మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాం.

సంబంధిత సమాచారం :

X
More