ఇంటర్వ్యూ: శివాత్మిక- అందుకే అమ్మానాన్న ఏది మాట్లాడిన న్యూస్ అవుతుంది…!

Published on Apr 15, 2020 4:57 pm IST

స్టార్ కిడ్ శివాత్మిక రాజశేఖర్ మొదటి చిత్రంతోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. పీరియాడిక్ లవ్ డ్రామాగా వచ్చిన దొరసాని గత ఏడాది విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కాగా ఈ అమ్మడు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ చిత్రంలో కూడా ఓ కీలక రోల్ చేస్తున్నారు. కాగా లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన శివాత్మికను 123తెలుగు.కామ్ ఫోన్ లో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ విశేషాలు మీ కోసం..

 

లాక్ డౌన్ ను ఎలా ఫీలవుతున్నారు?

లాక్ డౌన్ ప్రకటించే సమయానికి నేను… అక్క శివాని తో పాటు పాండిచ్చేరిలో ఉన్నాను. ఈ విషయం తెలిసిన వెంటనే హైదరాబాద్ కి ప్రయాణమై వచ్చేశాం. ఇక లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న పేదవారికి మావంతు సాయం చేస్తున్నాం. నేను, అక్క కలిసి రెండు లక్షలు సి సి సి కి విరాళంగా ఇచ్చాము.

 

కృష్ణ వంశీ సినిమాలో అవకాశం ఎలా వచ్చింది?

ఓ రోజు ఇంటికి వెళ్ళగానే అమ్మ పిలిచి కృష్ణ వంశీగారు కాల్ చేశారు అని చెప్పారు. నా కోసమా అక్క కోసమా అని అడిగాను. నీకోసమే అని చెప్పారు. కృష్ణ వంశీ గారిని ఆయన ఆఫీసులో కలవగా దొరసాని సినిమాలో నీ యాక్టింగ్ చూసి నచ్చి ఈ చిత్రం కోసం తీసుకున్నాను అన్నారు.

 

రంగ మార్తాండ చిత్రంలో మీ రోల్ ఎలా ఉంటుంది?

ఈ చిత్రంలో నేను ప్రకాష్ రాజ్ గారి కూతురి రోల్ చేస్తున్నాను. అలాంటి సీనియర్ నటుడితో చేయడం తో చాల కొత్త విషయాలు నేర్చుకున్నాను. ఇంకా కేవలం రెండు రోజుల షూట్ మాత్రమే నా పాత్రకు మిగిలివుంది. ఈ చిత్రంలో చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.

 

అక్క శివాని ఒక్క సినిమాకు చేయలేదు, చిన్నదానివైనా నీవు రెండు సినిమాలు పూర్తి చేశావ్.. ఎలా అనిపిస్తుంది?

ఈ క్వశ్చన్ నన్ను చాల మంది అడిగారు. కానీ నేను అధోరిణిలో ఆలోచించడానికి ఇష్టపడను. ఎవరు ముందు వచ్చారు అనేది ముఖ్యం కాదు. అక్క శివాని చాలా టాలెంటెడ్, ఆమె ఎదో ఓ రోజు మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంటుంది.

 

మీ నాన్నగారు రాజశేఖర్ ఎప్పుడూ ఎదో ఒక వివాదంలో ఉంటారు, అది మీకు ఎలా అనిపిస్తుంది?

అమ్మ, నాన్న చాలా పారదర్శకంగా నిస్పక్షపాతంగా ఉంటారు. మనసులో ఏమనిపిస్తే అది బయటికి చెప్పేస్తారు. దానితో సాధారణంగా వారు ఏది మాట్లాడిన అదో న్యూస్ అవుతుంది. నాకు తెలిసిన హానెస్ట్ పీపుల్ అమ్మానాన్నా, వారు అలా ఉండడానికే నేను ఇష్టపడతాను.

 

టాలీవుడ్ లో మీ ఇష్టమైన హీరో, హీరోయిన్ ఎవరు?
చెప్పాలంటే చాల మంది ఉన్నారు. హీరోయిన్స్ లో సాయి పల్లవి, నివేదా థామస్ అంటే ఇష్టం. ఐతే సమంత నాకు స్ఫూర్తిని ఇచ్చే హీరోయిన్. ఇక హీరోలలో నాని గారు అంటే ఇష్టం. తమిళ్ లో విజయ్ గారిని ఎక్కువగా ఇష్టపడతాను. సినిమాలలో వారివారి నటనను బట్టి ఈ ఇష్టాలు మారిపోతూ ఉంటాయి.

 

మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమిటీ?

రంగ మార్తాండ తో చిత్రంలో చేస్తున్నాను అలాగే అరుణ్ అదిత్ తో ఓ మూవీ చేస్తున్నాను, అది ప్రకటించాల్సివుంది.

సంబంధిత సమాచారం :

X
More