ఆగని ‘చెన్నై లవ్ స్టోరీ’ మ్యానియా.. రెండో వీకండ్ లో షాకింగ్ బుకింగ్స్!

రీసెంట్ గా మన తెలుగు సినిమా నుంచి వచ్చిన సూపర్ డూపర్ హిట్ చిత్రమే ‘చెన్నై లవ్ స్టోరీ’. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా శ్రీ గౌరీ ప్రియా హీరోయిన్ గా దర్శకుడు రవి నంబూరి తెరకెక్కించిన ఈ సూపర్ హిట్ చిత్రం ఆడియెన్స్ ని థియేటర్స్ కి ఇప్పటికీ రప్పిస్తూ సెన్సేషన్ ని సెట్ చేసింది.

ప్రస్తుతం ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇండియా వైడ్ గా కూడా స్పైడర్ మ్యాన్ లాంటి సినిమా ఫీవర్ నడుస్తున్నప్పటికీ కొత్త సినిమాలు వచ్చినప్పటికీ చెన్నై లవ్ స్టోరీ బుకింగ్స్ మాత్రం షాకింగ్ హా ఉన్నాయి. ఈ రెండో వారాంతంలో సినిమా బుకింగ్స్ గంటకి 5 వేలకి పైగా టికెట్ సేల్స్ తో ట్రెండింగ్ లో కొనసాగుతూ ఉండడం విశేషం.

ఇది మాత్రం ఒకింత షాకింగ్ అంశమే అని చెప్పాలి. ముందు నుంచి మేకర్స్ చెబుతున్నట్టుగానే కల్ట్ బ్లాక్ బస్టర్ స్టేటస్ ని ఈ సినిమా అందుకుంది. ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించగా సాయి రాజేష్, ఎస్ కే ఎన్ లు నిర్మాణం వహించారు.

Exit mobile version