‘ఇరుముడి’ సీక్వెల్ లో రామ్ చరణ్? క్లారిటీ ఇచ్చేసిన దర్శకుడు!

‘ఇరుముడి’ సీక్వెల్ లో రామ్ చరణ్? క్లారిటీ ఇచ్చేసిన దర్శకుడు!

Published on Sep 2, 2026 6:03 PM IST

తెలుగు సినిమా లేటెస్ట్ గా అందుకున్న ఆర్గానిక్ సెన్సేషనల్ హిట్ చిత్రమే ‘ఇరుముడి’. మాస్ మహారాజ రవితేజ హీరోగా ఒక్క సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో తెలుగు సినిమా కనీ వినీ ఎరుగని రీతి సంచలనం రేపే సినిమాని రవితేజ తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఈ సినిమాకి కూడా సీక్వెల్ ముచ్చట్లు మొదలయ్యాయి. నిజానికి మేకర్స్ ఎలాంటి లీడ్ లేకుండా సింగిల్ పార్ట్ గానే దీన్ని ముగించేశారు.

అయితే ఇరుముడి సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రెజెన్స్ పై రేగిన రచ్చ అంతా ఇంతా కాదు. అయితే పార్ట్ 2 చరణ్ తో అయినా ఉంటుందా అనే ప్రశ్నకి దర్శకుడు శివ నిర్వాణ క్లారిటీ ఇచ్చారు. ఇరుముడి అనే సినిమా చాలా ఆర్గానిక్ గా మొదలైన లైన్ అని, అలానే ఒకవేళ రెండో భాగం చెయ్యాలి అనుకున్నా కూడా చాలా ఆర్గానిక్ గానే ఏదైనా జరగాలి అని మనం అనుకుంటే జరగదని శివ నిర్వాణ పార్ట్ 2 ఆలోచనలు ఏమీ లేవని క్లారిటీ ఇచ్చేసారు.

తాజా వార్తలు