చరణ్, చిరు సినిమాలని వెనక్కి నెట్టిన ‘ఇరుముడి’ !

చరణ్, చిరు సినిమాలని వెనక్కి నెట్టిన ‘ఇరుముడి’ !

Published on Aug 23, 2026 11:00 AM IST

రవితేజ నటించిన కొత్త సినిమా ‘ఇరుముడి’. ఈ సినిమాకి థియేటర్స్ లో వస్తున్న అద్భుతమైన స్పందన ట్రేడ్ వర్గాలను కూడా ఆశ్చర్యపరుస్తోంది. పాజిటివ్ సమీక్షలు మరియు ప్రేక్షకుల నుంచి లభించిన భారీ ఆదరణ కారణంగా థియేటర్లకు జనం భారీగా తరలివస్తున్నారు, ఇప్పటికే ఈ చిత్రం పలు ప్రాంతాల్లో బ్రేక్-ఈవెన్ ను సాధించింది. ఐతే, ఈ సినిమాకు సంబంధించి మరో గొప్ప విషయం శనివారం నాడు సాధించిన బుకింగ్స్. సినిమా విడుదలైన రెండో రోజైన శనివారం నాడు ‘ఇరుముడి’ ఏకంగా 5,37,350కి పైగా టికెట్ల అమ్మకాలను నమోదు చేసింది.

ఈ సంఖ్య ‘పెద్ది’, ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రాల రెండో రోజు బుకింగ్ గణాంకాల కంటే ఎక్కువ కావడం విశేషం. ఎవరూ ఊహించని రీతిలో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. మొదటి రోజు కంటే రెండో రోజు అమ్మకాలు భారీగా పెరగడం ఈ సినిమాను మరింత ఆకట్టుకునేలా చేస్తోంది. మొత్తానికి ఈ ఫ్యామిలీ థ్రిల్లర్ డ్రామా మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించగా మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు.

తాజా వార్తలు