ట్రైలర్ టాక్: డిస్నీ టైప్ విజువల్స్, ఎమోషన్ తో మ్యాజిక్ చేసిన ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’

ట్రైలర్ టాక్: డిస్నీ టైప్ విజువల్స్, ఎమోషన్ తో మ్యాజిక్ చేసిన ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’

Published on Sep 22, 2026 7:00 PM IST

మలయాళ టాలెంటెడ్ హీరో ఫహద్ ఫాజిల్ టాలీవుడ్ లోకి ‘పుష్ప’ తో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ తాను హీరోగా డెబ్యూ ఇచ్చిన చిత్రమే ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’. రాజమౌళి అండ్ టీం బ్యాక్ చేసిన ఈ చిత్రాన్ని శశాంక్ యేలేటి తెరకెక్కించిన ఈ మ్యాజికల్ థ్రిల్లర్ చిత్రం నుంచి మేకర్స్ ఇంట్రెస్టింగ్ ట్రైలర్ కట్ ని ఇప్పుడు విడుదల చేశారు.

నటసింహం బాలయ్య బేస్ వాయిస్ తన ఫేమస్ డైలాగ్ డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ ని పర్ఫెక్ట్ గా సింక్ చేస్తూ ప్రెజెంట్ చేసిన ట్రైలర్ లో కంటెంట్ మంచి ప్రామిసింగ్ గా ఉందని చెప్పవచ్చు. డబ్బులు, ట్రబుల్స్ తో ఎప్పుడూ ట్రావెల్ అయ్యే సూరి (ఫహద్ ఫాజిల్) లైఫ్ లోకి వచ్చిన ఓ మ్యాజికల్ పాప వచ్చిన తర్వాత ఏం జరిగింది అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా రాబోతున్నట్టు కనిపిస్తుంది. అయితే ఇందులో అన్నిటికంటే బిగ్గెస్ట్ హైలైట్ మాత్రం సినిమా తాలూకా రిచ్ క్వాలిటీ అని చెప్పొచ్చు.

ఆ విజువల్స్ చూస్తుంటే ఏదో డిస్నీ వాళ్ళ ఫాంటసీ సినిమా చూస్తున్న ఫీల్ కలుగుతుంది. వీటితోనే కాకుండా ఫహద్ కి ఆ చిన్న పాపకి నడుమ మంచి ఎమోషనల్ ట్రాక్ కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. సో మొత్తానికి ఈ అక్టోబర్ 2 న ఓ మ్యాజికల్ ట్రీట్ ని ఇచ్చేలా ఉన్నారని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందిస్తుండగా ఎస్ ఎస్ కార్తికేయ, బాహుబలి నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలు నిర్మాణం వహించారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు