‘లెనిన్’ ఓటిటి రిలీజ్ పై ఈ క్లారిటీ కూడా!

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అక్కినేని అఖిల్ హీరోగా భాగ్యశ్రీ హీరోయిన్ గా దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం ‘లెనిన్’ కోసం అందరికీ తెలిసిందే. ఈ చిత్రం థియేట్రికల్ గా 100 కోట్లకు పైగా గ్రాస్ ని రాబట్టి అఖిల్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి సెన్సేషనల్ కంబ్యాక్ గా నిలిచింది.

అయితే అయితే ఈ సినిమా థియేటర్స్ నుంచి ఇప్పుడు ఓటిటి రిలీజ్ కి సిద్ధం అయ్యిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని జీ 5 వారు సొంతం చేసుకోగా అందులో ఈ ఆగష్టు 7 నుంచి అందుబాటులోకి వస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు.

అయితే మొదట కేవలం తెలుగు వెర్షన్ వరకు మాత్రమే అనౌన్స్ చేసిన వారు ఇప్పుడు తమిళ్, కన్నడ సహా మలయాళ వెర్షన్ లలో రిలీజ్ కానున్నట్టు కన్ఫర్మ్ చేశారు. సో లెనిన్ కి ఇతర ఆడియెన్స్ లో కూడా మంచి రీచ్ వస్తుంది అని చెప్పవచ్చు. అయితే హిందీ వెర్షన్ పై ప్రస్తుతానికి ఎలాంటి క్లారిటీ లేదు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా నాగార్జున, నాగవంశీలు నిర్మాణం వహించారు.

Exit mobile version