సర్ప్రైజింగ్: ఈ ఫార్మాట్ లో కూడా ‘ది ప్యారడైజ్’ విడుదల!

సర్ప్రైజింగ్: ఈ ఫార్మాట్ లో కూడా ‘ది ప్యారడైజ్’ విడుదల!

Published on Sep 23, 2026 12:30 AM IST

నాచురల్ స్టార్ నాని హీరోగా యంగ్ హీరోయిన్ కయాదు లోహర్ హీరోయిన్ గా యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన అవైటెడ్ సినిమా ది ప్యారడైజ్ కోసం తెలుగు రాష్ట్రాల ఆడియెన్స్ ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి థియేటర్స్ లో మంచి ఎక్స్ పీరియన్స్ ఇచ్చే విధంగా సాధారణ ఫార్మాట్ తో పాటుగా డాల్బీ సినిమా ఫార్మాట్ ని కూడా మేకర్స్ కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే.

కానీ సర్ప్రైజింగ్ గా మరో ఫార్మాట్ లో కూడా ది ప్యారడైజ్ థియేటర్స్ లో ట్రీట్ ఇవ్వనుంది. హైదరాబాద్ బుకింగ్స్ లో తాజాగా 4డిఎక్స్ వెర్షన్ లో కూడా విడుదల చేస్తున్నట్టు పొందుపరిచారు. సో ప్యారడైజ్ లోకంలోనే ఉండే ఎక్స్ పీరియన్స్ కూడా దీనితో వస్తుంది అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఎస్ ఎల్ వి సినిమాస్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు