మలయాళ నటికి తెలుగులో క్రేజీ ఆఫర్స్‌!

anupama
అనుపమ పరమేశ్వరన్.. ‘ప్రేమమ్’ అనే మళయాల సెన్సేషనల్ సినిమాతో సినీ పరిశ్రమకు పరిచయమైన మలయాళ నటి. మొదటి సినిమాతోనే యావత్ సౌతిండియా సినిమా దృష్టినీ తనవైపుకు తిప్పుకున్న ఈ నటికి ప్రస్తుతం తెలుగులో వరుస అవకాశాలు వచ్చిపడుతున్నాయి. ఇప్పటికే తెలుగులో టాప్ డైరెక్టర్స్‌లో ఒకరైన త్రివిక్రమ్ తెరకెక్కిస్తోన్న ‘అ..ఆ..’లో నటించే అవకాశం సొంతం చేసుకున్న ఈ హీరోయిన్, ఆ వెంటనే మరో రెండు క్రేజీ అవకాశాలను కూడా సొంతం చేసుకొని టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయారు.

నాగ చైతన్య హీరోగా మళయాల ‘ప్రేమమ్’ సినిమాకు తెలుగు రీమేక్ రూపొందుతోన్న విషయం తెలిసిందే. తనకు ఏ సినిమా అయితే క్రేజ్ తెచ్చిపెట్టిందో అదే సినిమాకు రీమేక్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలోనూ నటించే అవకాశాన్ని అనుపమ సొంతం చేసుకున్నారు. చందూ మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక రవితేజ-వేణు శ్రీరామ్‌ల కాంబినేషన్‌లో దిల్‌రాజు రూపొందించనున్న మరో సినిమాలోనూ అనుపమ హీరోయిన్‌గా ఎంపికయ్యారు. ఇలా ఒకే ఒక్క సినిమా అనుపమకు తెలుగులో వరుస అవకాశాలను తెచ్చిపెట్టడం విశేషంగా మారిపోయింది.

Exit mobile version