యు.ఎస్ లో బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ సాధించిన ‘మనం’

manam
అక్కినేని కుటుంబంలోని మూడుతరాలు నటించిన ‘మనం’ గురించిన చర్చే ఎక్కడ చూసినా కనిపిస్తుంది. యు.ఎస్ లో మే 22న విడుదల అయిన ఈ చిత్రం మంచి ఓపెనింగ్స్ సాధించింది.

దాదాపుగా అన్ని ప్రీమియర్ షో టికెట్ లు పూర్తిగా అమ్ముడయ్యాయి. ఇప్పుడు వీకెండ్ కావడంతో కలెక్షన్స్ ఇంకా పెరుగుతాయి. ఈ చిత్రం ఇప్పటికి 2,29,081 డాలర్లు సంపాదించింది అలాగే రోజురోజుకి కలెక్షన్స్ పెరుగుతున్నాయి.

సోమవారం యు.ఎస్ లో సెలవు కావడంతో ఈ చిత్రం ఒక మిలియన్ మార్క్ ని దాటుతుందని అంచనా. అక్కినేని కుటుంబం నటించిన ఈ చిత్రానికి విక్రం కుమార్ దర్శకత్వం అందించారు. అనుప్ రుబెన్స్ సంగీతం అందించారు.

Exit mobile version