దర్శకుడు రామ్ కుమార్ దర్శకత్వంలో ఓ.యస్.యం విజన్ మరియు దివ్యాషిక క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “నేను లేను”. లాస్ట్ ఇన్ లవ్ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రంలో హర్షిత్ హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. టీజర్ విడుదలై వన్ మిలియన్ వ్యూస్ ను అందుకుంది.
ఈ సందర్భంగా దర్శకుడు రామ్ కుమార్ మాట్లాడుతూ … అందమైన ప్రేమకథతో సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన చిత్రం నేను లేను .
ఇటివలే విడుదలైన మా టీజర్ కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడం చాల ఆనందంగా ఉంది .మంచి కాన్సప్ట్ తో సినీమా తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు అనే నమ్మకంతో తీసిన చిత్రం ” నేను లేను “. విడుదలైన మా టీజర్ కి వన్ మిలియన్ వ్యూస్ రావడం సినీమా పై మరింత నమ్మకాన్ని పెంచింది . అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.
హర్షిత్, వంశీకృష్ణ పాండ్య, శ్రీపద్మ, మాధవి, బిశ్వజిత్నాధ్, రుద్రప్రకాశ్, వేల్పుల సూరి, యుగంధర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:ఆశ్రిత్, ఛాయాగ్రహణం:ఎ. శ్రీకాంత్ (బి.ఎఫ్.ఎ), నృత్యాలుః జోజో, సహ నిర్మాత : యాషిక, నిర్మాత : సుక్రి కుమార్, రచన – దర్శకత్వం : రామ్ కుమార్ ఎమ్ .ఎస్ .కె.
టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి