
సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా సర్కారు వారి పాట టీమ్ సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్ పేరిట టీజర్ ను విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం టీజర్ యూ ట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే 10 మిలియన్ ప్లస్ రియల్ టైమ్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. అదే విధంగా 492 కె లైక్స్ ను సొంతం చేసుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటిస్తున్న ఈ చిత్రం నుండి టీజర్ రావడం తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పరశురాం దర్శకత్వం లో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట వచ్చే ఏడాది సంక్రాంతి కి విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రం నుండి మరిన్ని అప్డేట్స్ వచ్చే విధంగా సర్కారు వారి పాట టీమ్ పలు ఏర్పాట్లు చేస్తోంది. అదే విధంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి సంబంధించిన అప్డేట్ నేడు సాయంత్రం విడుదల కానుంది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి