ఫిబ్రవరి 13న ‘100 డేస్ లవ్ స్టోరీ’ విడుదల.. ట్రైలర్ ఆవిష్కరణ

ఫిబ్రవరి 13న ‘100 డేస్ లవ్ స్టోరీ’ విడుదల.. ట్రైలర్ ఆవిష్కరణ

Published on Jan 24, 2026 12:31 AM IST

100 Days Love Story Movie Trailer

శ్రీ సాయి శివ ప్రియ క్రియేషన్స్ పతాకంపై పురిపండ వి. వెంకటరమణ మూర్తి శర్మ నిర్మాతగా, విజయమిత్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘100 డేస్ లవ్ స్టోరీ’. ‘అతి ప్రేమ భయానకం’ అనేది ఉపశీర్షిక. ఈ సినిమా ట్రైలర్‌ను శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రముఖ నిర్మాత సాయి వెంకట్ చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు.

ట్రైలర్ విడుదల అనంతరం సాయి వెంకట్ మాట్లాడుతూ.. “ట్రైలర్ చాలా బాగుంది. ప్రస్తుత సమాజంలో ప్రేమ పేరుతో జరుగుతున్న మోసాలు, యువత విచ్చలవిడితనానికి బానిసలవడం వంటి అంశాలను ఈ చిత్రం ద్వారా చర్చిస్తున్నట్లు అర్థమవుతోంది” అని అన్నారు. హీరో జయ శివ సూర్య మాట్లాడుతూ, తనను చాలామంది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో పోల్చడం ఆనందంగా ఉందని, ఈ సినిమా తనకు మంచి బ్రేక్ ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

రొటీన్ చిత్రాలకు భిన్నంగా అన్ని వర్గాలను ఆకట్టుకునేలా సినిమాను తీర్చిదిద్దినట్లు దర్శకుడు విజయమిత్ర తెలిపారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 13న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు నిర్మాత ప్రకటించారు. నిఖిత శ్రీ, ఇషా మనోహరి ప్రియ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి తరుణ్ రాణాప్రతాప్ సంగీతం అందించారు.

100 Days Love Story Movie Trailer

తాజా వార్తలు