100 మిలియన్ వ్యూస్ తో “కుర్చీ మడతపెట్టి” సాంగ్!

100 మిలియన్ వ్యూస్ తో “కుర్చీ మడతపెట్టి” సాంగ్!

Published on Feb 16, 2024 8:30 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ గుంటూరు కారం. ఈ చిత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టడం జరిగింది. ఈ చిత్రం లోని కుర్చీ మడతపెట్టి సాంగ్ ఆడియెన్స్ ను, ఫ్యాన్స్ ను విశేషం గా ఆకట్టుకుంది. సినిమా రిజల్ట్ పై ఈ సాంగ్ ఎఫెక్ట్ కచ్చితంగా ఉందని చెప్పాలి.

కుర్చీ మడతపెట్టి లిరికల్ వీడియో ఇప్పుడు యూ ట్యూబ్ లో 100 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. వీడియో సాంగ్ కూడా భారీ వ్యూస్ తో దూసుకు పోతుంది. ఇది సూపర్ రెస్పాన్స్ అని చెప్పాలి. ఈ పాటలో సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ బ్యూటీ శ్రీ లీల లు ఇద్దరూ కూడా సూపర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి, ఆడియెన్స్ ను అలరించారు. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, రమ్య కృష్ణ, ప్రకాష్ రాజ్, జయరామ్, జగపతి బాబు, ఈశ్వరి రావు తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు