100 మిలియన్ వ్యూస్ తో “పుష్ప 2” టైటిల్ సాంగ్!

100 మిలియన్ వ్యూస్ తో “పుష్ప 2” టైటిల్ సాంగ్!

Published on May 28, 2024 5:00 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా, స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ పుష్ప 2 ది రూల్ (Pushpa 2 the rule). ఈ చిత్రం ను ఆగస్ట్ 15, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ చిత్రం నుండి రిలీజైన పుష్ప పుష్ప అనే టైటిల్ సాంగ్ భారీ వ్యూస్ తో దూసుకు పోతుంది. ఇప్పటి వరకు 100 మిలియన్స్ కి పైగా వ్యూస్ వచ్చాయి. 2.26 మిలియన్స్ లైక్స్ వచ్చాయి. ఇది సూపర్ రెస్పాన్స్ అని చెప్పాలి. ఈ చిత్రం నుండి సెకండ్ సింగిల్ రేపు రిలీజ్ కానుంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ్, ధనంజయ, సునీల్, రావు రమేష్, ఫహాద్ ఫాసిల్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు