టీజర్ తో రానున్న కళ్యాణ్ రామ్ !

Published on Dec 17, 2018 11:00 am IST

‘నా నువ్వే’ తో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరో నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం తన 16వ చిత్రం ‘118’ లో నటిస్తున్నాడు. ఈచిత్రం యొక్క షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఇక ఈచిత్రం యొక్క ట్రైలర్ ను రేపు ఉదయం 10:30 గంటలకు విడుదలచేయనున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నివేత థామస్,షాలిని పాండే హీరోయిన్లుగా నటిస్తున్నారు.

థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకం ఫై మహేష్ ఎస్ కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో విడుదలకానుంది. ఇక ఈ చిత్రం తరువాత కళ్యాణ్ రామ్ ‘ఉయ్యాలా జంపాల , మజ్ను’ చిత్రాల దర్శకుడు విరించి వర్మ దర్శకత్వంలో తన 17వ చిత్రంలో నటించనున్నారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్న ఈ చిత్రం ఫై త్వరలోనే అధికారిక ప్రకటన వెలుబడనుంది.

సంబంధిత సమాచారం :