డాగ్ ని క్లోజ్ చేసుకోవడం కోసం 14 లక్షలు.!

డాగ్ ని క్లోజ్ చేసుకోవడం కోసం 14 లక్షలు.!

Published on Jun 17, 2014 5:48 PM IST

tommy
ఒక డాగ్ ని క్లోజ్ చేసుకోవడానికి 14 లక్షలు ఇస్తారా? అని ఆశ్చర్య పోతున్నారా.!! మీరు విన్నది నిజమే. కానీ అందరికీ కాదండోయ్ ఒక్క రాజేంద్ర ప్రసాద్ కి మాత్రమే. అసలు విషయంలోకి వెళితే.. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ మరియు ఒక డాగ్ తో ఒక పీరియడ్ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇందుకోసం రాజంద్ర ప్రసాద్ రెండు వారల పాటు ఆ డాగ్ తో బాగా క్లోజ్ అవ్వాలని అందుకు రెండు వారాలు కేటాయించాలని కోరింది. ఆ రెండు వారాల కోసం రాజేంద్ర ప్రసాద్ కి 14 లక్షలు రెమ్యూనరేషన్ ఇచ్చారు. ఈ రెండు వారాల్లో రాజేంద్ర ప్రసాద్ వేరే ఏ సినిమాకి పనిచేయకూడదు.

ప్రస్తుతం రాజేంద్ర ప్రసాద్ బూగీ(డాగ్ పేరు)తో క్లోజ్ అయ్యే పనిలో ఉన్నాడు. 1930 టైంలో జర్మనీలో ఒక డాగ్ జీవితంలో జరిగిన యదార్థ గాదని ఈ సినిమాలో చూపిస్తున్నారు. రాజా వన్నెంరెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి ‘టామీ’ అనే పేరును పెట్టారు, ఎ లవ్లీ డాగ్ అనేది ఈ సినిమాకి ఉపశీర్షిక. చేగొండి హరిబాబు నిర్మిస్తున్న ఈ సినిమాకి చక్రి సంగీతం అందిస్తున్నాడు. గతంలో కూడా రాజేంద్ర ప్రసాద్ ‘క్విక్ గన్ మురుగన్’, ‘డ్రీం’ లాంటి ప్రయోగాత్మక సినిమాలు చేసారు. అదే కోవలోనే ఈ సినిమా కూడా ఉంటుంది.

తాజా వార్తలు