2.0 చైనాలో మొదటివారం వసూళ్లు ఎంతంటే…?

2.0 చైనాలో మొదటివారం వసూళ్లు ఎంతంటే…?

Published on Sep 13, 2019 9:10 AM IST

ఈనెల 6న రజిని కాంత్ 2.0 చైనాలో భారీ ఎత్తున విడుదలైంది. దర్శకుడు శంకర్ తెరకెక్కించిన టెక్నలాజికల్ వండర్ 2.0 మొదటి రోజే 9కోట్లకు పైగా వసూళ్లు సాధించి అబ్బుర పరిచింది. మొదటి వారానికి గాను ఈ చిత్రం చెప్పుకోదగ్గ వసూళ్లే సాధించినట్లు తెలుస్తుంది. ఏడవరోజైన నిన్న గురువారం 2.0 మూవీ $80000 వసూళ్లు రాబట్టింది. దీనితో ఏడురోజుల రన్ పూర్తయ్యే నాటికి $ 3.08 మిలియన్ వసూళ్లు రాబట్టినట్టు సమాచారం. 2.0 వసూళ్లను గమనిస్తే చైనాలో ఈ చిత్రానికి మంచి ఆదరణే దక్కుతుందని తెలుస్తుంది.

ఇక లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన 2.0 చిత్రాన్ని 450కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించడం జరిగింది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రతినాయకుడిగా చేయగా, అమీ జాక్సన్ హీరోయిన్ గా చేశారు. ఇక ప్రముఖ సంగీత దర్శకులు ఏ ఆర్ రెహ్మాన్ ఈ చిత్రానికి సంగీతం అందించడం జరిగింది.ఇండియాలో అన్ని ప్రధాన భాషలలో విడుదలైన ఈ చిత్రం అన్ని చోట్లా విశేష స్పందన దక్కించుకుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు