‘2.0’ ఆ చిత్రాలకు వరంలా మారింది !

‘2.0’ ఆ చిత్రాలకు వరంలా మారింది !

Published on Nov 28, 2018 2:10 PM IST

సూపర్ స్టార్ రజినీకాంత్ – శంకర్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘2.0’ రేపు ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఇది వరకు ఎన్నడూ చూడని విజువల్స్ తో రానున్న ఈ చిత్రం కోసం సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ చిత్రం టాలీవుడ్ మీడియం బడ్జెట్ చిత్రాల ప్రమోషన్స్ కు బాగా ఉపయోగపడుతుంది. యూఎస్ లో ఈ చిత్రం ప్రదర్శింపబడుతున్న స్క్రీన్ లలో ‘పడి పడి లేచె మనసు , అంతరిక్షం , యాత్ర’ చిత్రాల టీజర్లను ప్రదర్శించనున్నారు. దాంతో ఈ చిత్రాలకు కావాల్సినంత పబ్లిసిటీ రానుంది.

ఎలాగూ 2.0 చిత్రాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు కాబట్టి ఈ చిత్రాలను వారికీ పరిచయం చేయడానికి దీన్ని ఒక మంచి అవకాశం గా భావించవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు