అమెరికాలో రికార్డు స్థాయిలో విడుదలవుతున్న 2.0 !

అమెరికాలో రికార్డు స్థాయిలో విడుదలవుతున్న 2.0 !

Published on Nov 22, 2018 12:00 AM IST


2.0 చిత్రం విడుదల కోసం దేశవ్యాప్తంగా ఎంత క్రేజ్ నెలకొందో విదేశాల్లో కూడా ఈ చిత్రం అదే క్రేజ్ ను రాబట్టుకుంది. ఇక ఈ చిత్రం అమెరికా లో రికార్డు స్థాయిలో విడుదలకానుందట. అక్కడ ఈచిత్రంయొక్క ప్రీరిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరగడంతో ఆ మొత్తాన్ని రాబట్టుకోవడం కోసం ఏకంగా 300 థియేటర్లలో ఈ చిత్రాన్ని ప్రదర్శించడానికి సన్నాహాలు చేస్తున్నారట. అమెరికా లో ఈ స్థాయిలో విడుదలవుతున్న మొట్ట మొదటి భారతీయ చిత్రం కూడా ఇదే కావడం విశేషం.

ఎఆర్ రహమాన్ సంగీతం అందించిన ఈచిత్రాన్ని భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. ఈ నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా తెలుగు , తమిళ , హిందీ భాషల్లో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు