షాక్ ఇస్తున్న ‘2.0’ తెలుగు హక్కుల ధర !

షాక్ ఇస్తున్న ‘2.0’ తెలుగు హక్కుల ధర !

Published on Nov 10, 2018 10:10 AM IST


క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న’2.0’చిత్రం ఈ నెల 29న తెలుగు , తమిళ , హిందీ భాషల్లో భారీ స్థాయిలో విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఇక ఈచిత్రం యొక్క తెలుగు హక్కుల ధర ఇప్పుడు చిత్ర వర్గాల్లో హాట్ టాపిక్ అవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాలకు గాను ఈ చిత్రం యొక్క తెలుగు వెర్షన్ హక్కులను ఎన్వీఆర్ సినిమాస్ దక్కించుకుంది. అయితే ఈ హక్కుల కోసం ఏకంగా 80కోట్ల వరకు చెల్లించారట. మరి ఈచిత్రం ఈ రేంజ్ లో వసూళ్లు రాబట్టడం సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సినీవిశ్లేషకులు. అసలు ఈచిత్రం యొక్క టీజర్ విడుదల అయ్యే వరకు ఈచిత్రాన్ని కొనడానికి కూడా ఎవరు ఆసక్తిని చూపించలేదు. కానీ టీజర్ తో చిత్రానికి భారీ హైప్ తెప్పించడంలో శంకర్ విజయం సాధించాడు. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా ప్రామిసింగ్ గా ఉడడంతో ఈచిత్రం ఫై అంచనాలు తార స్థాయికి చేరుకున్నాయి.

సూపర్ స్టార్ రజినీకాంత్ ,బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ , అమీ జాక్సన్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. భారీ వీఎఫ్ఎక్స్ తో రానున్న ఈ చిత్రానికి ఎఆర్ రహెమాన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు