‘రోబో-2’ 2019కి వాయిదాపడిందా ?

‘రోబో-2’ 2019కి వాయిదాపడిందా ?

Published on Jun 9, 2018 4:46 PM IST


దక్షిణాది ప్రేక్షకులు మాత్రమే కాకుండా అన్ని పరిశ్రమల సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న చిత్ర్రం ‘రోబో-2’ రజనీ ప్రధాన పాత్రలో శంకర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం 2010లో వచ్చిన ‘రోబో’కు కొనసాగింపుగా ఉండనుంది. చాన్నాళ్ల క్రితమే టాకీ పార్టీ పూర్తికి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం విఎఫ్ఎక్స్ పనుల్లో ఉంది.

ఇంకా చాలా సీజీ వర్క్ మిగిలి ఉండటంతో విడుదల ఈ ఏడాదిలో ఉండే సూచనలు లేవని, 2019 ఆరంభంలో విడుదల ఉండొచ్చని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే అనుకున్న దానికంటే బడ్జెట్ కూడ ఎక్కువే అయింది. ఏది ఏమైనా విడుదల విషయం మాత్రం విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ పూర్తయ్యాకే ఒక కొలిక్కి రానుంది. అమీ జాక్సన్, అక్షయ్ కుమార్ లు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు