వివాదాలతో నిలిచిపోయిన “2స్టేట్స్” చిత్రీకరణ

Published on May 27, 2019 3:27 pm IST

ల‌క్ష్య ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యానర్‌లో చేత‌న్ భ‌గ‌త్ రాసిన న‌వ‌ల 2 స్టేట్స్‌ ఆధారంగా రూపొందిస్తున్న చిత్రం `2 స్టేట్స్‌`. అడ‌విశేషు, శివానీ రాజ‌శేఖ‌ర్ జంటగా నటిస్తుండగా, వెంక‌ట్ రెడ్డి ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఎం.ఎల్‌.వి.స‌త్య‌నారాయ‌ణ (స‌త్తిబాబు) నిర్మాత‌. దాదాపు 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా చిత్రీకరణ మధ్యలో దర్శకుడు నిర్మాతలకి మధ్య స్టోరీ మార్పుల విషయం లో ఏర్పడిన వివాదలు చిత్ర షూటింగ్ నిలిపివేతకు దారితీసింది.

వివాదం పై దర్శకుడు వెంకట రెడ్డి స్పందిస్తూ సినిమా 70% అవుట్ ఫుట్ బాగా వచ్చిన తరువాత నిర్మాత కథలో మార్పులు చేయమన్నారు, దానికి నేను తిరస్కరించడంతో, ఉద్దేశపూర్వకముగా నన్ను ప్రాజెక్ట్ నుండి తప్పించడానికి చూస్తున్నారని ఆయన ఆరోపించారు.

ముంబై లో జరిగిన అగ్రిమెంట్ ప్రకారం ఈ సినిమా దర్శకత్వ హక్కులు నాకే చెందుతాయి. కాదని మరొక కొత్త డైరెక్టర్ తో మిగిలిన భాగం చేయాలనీ చుస్తే చట్ట పరంగా చర్యలు ఎదుర్కోవలసి వస్తుందన్నారు. వెంకట రెడ్డి వి వి వినాయక్ దగ్గర పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసారంట.

సంబంధిత సమాచారం :

More