200 రోజుల్లో థియేటర్లలోకి “పుష్ప 2 ది రూల్”

200 రోజుల్లో థియేటర్లలోకి “పుష్ప 2 ది రూల్”

Published on Jan 29, 2024 2:25 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప 2 ది రూల్. మొదటి భాగం పుష్ప ది రైజ్ థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంది. సీక్వెల్ పుష్ప 2 ది రూల్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం మరో 200 రోజుల్లో థియేటర్ల లోకి రానుంది. ఆగస్ట్ 15, 2024 న సినిమా రిలీజ్ కానున్నట్లు మరోసారి సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు మేకర్స్.

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న లేడీ లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ చిత్రంలో ఫాహద్ ఫజిల్, ధనంజయ, అనసూయ భరద్వాజ్, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు