2018లో చేసిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ పరాజయం తర్వాత ఆలోచనలో పడిన అల్లు అర్జున్ తర్వాతి సినిమాల్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నారు. 2019లో ‘అల వైకుంఠపురములో’ సినిమా స్టార్ట్ చేశారు కానీ ఆయన సినిమాలేవీ విడుదల కాలేదు. దీంతో అభిమానులు కొంత నిరుత్సాహానికి గురయ్యారు.
అయితే వారి నిరుత్సాహమంతా 2020లో ఎగిరిపోనుంది. సంవత్సరం ఆరంభంలో ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో పలకరించనున్న ఆయన సుకుమార్ డైరెక్షన్లో చేయనున్న చిత్రాన్ని కూడా 2020లోనే విడుదల చేయనున్నారు. ఇక 21, 22, 23వ చిత్రాల్ని కూడా ఇదే ఏడాదిలోనే లాంఛ్ చేసే అవకాశముంది. సో.. జనవరి నుండి మొదలుపెడితే ఆఖరు వరకు బన్నీ సినిమాల అప్డేట్స్ తో అభిమానులకు ఫుల్ జోష్ దొరుకనుంది.


