సూర్య క్రేజీ ప్రాజెక్ట్ ఫస్ట్‌లుక్ రిలీజ్ డేట్

సూర్య క్రేజీ ప్రాజెక్ట్ ఫస్ట్‌లుక్ రిలీజ్ డేట్

Published on Nov 9, 2015 2:35 PM IST

surya
తమిళ సూపర్ స్టార్ సూర్య హీరోగా రూపొందుతోన్న ’24’ సినిమా గత కొద్దికాలంగా సగటు సినీ అభిమానిని విపరీతంగా ఆకర్షిస్తోంది. ’13 బీ’, ‘ఇష్క్’, ‘మనం’ లాంటి విలక్షణ సినిమాలతో మెప్పించిన దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కావడం, ఓ సైన్స్ ఫిక్షన్ కథాంశంతో రూపొందిన వినూత్న సినిమా కావడంతో ’24’ సినిమాకు తెలుగు, తమిళంలో అద్భుతమైన క్రేజ్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు ఇప్పటికే బిజినెస్ కూడా పెద్ద ఎత్తున జరిగింది.

ఇక ఈ మధ్యే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన స్టిల్ కానీ, పోస్టర్ కానీ ఇప్పటివరకూ రిలీజ్ కాని పక్షంలో అభిమానులు ఈ సినిమా ఫస్ట్‌లుక్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ ఎదురుచూపులకు తెరదించుతూ సూర్య, నవంబర్ 24న ఫస్ట్‌లుక్‌తో మెప్పించేందుకు సిద్ధమవుతున్నారు. కథ రీత్యా 24 నెంబర్‌కు ఉన్న ప్రత్యేకతను కంటిన్యూ చేస్తూ ఫస్ట్‌లుక్‌ను 24వ తేదీన ప్లాన్ చేశారు. సూర్య తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. సూర్య సరసన సమంత హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను తెలుగులో ప్రముఖ హీరో నితిన్ విడుదల చేయనున్నారు. సంక్రాంతి సీజన్‌కు ఈ సినిమా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు