2.0 హిందీ వర్షన్ రికార్డు స్థాయిలో విడుదలకానుంది !

2.0 హిందీ వర్షన్ రికార్డు స్థాయిలో విడుదలకానుంది !

Published on Nov 25, 2018 10:48 AM IST


సూపర్ స్టార్ రజినీ కాంత్ – శంకర్ ల కలయికలో తెరకెక్కిన విజువల్ వండర్ ‘2.0’ విడుదలకు ఇంకా నాలుగు రోజుల సమయం మాత్రమే మిగిలివుంది. ఇక ఈ చిత్రం తెలుగు , తమిళ , హిందీ భాషల్లో విడుదలకానుంది తెలిసిందే. అయితే ఈ చిత్ర హిందీ వెర్షన్ దేశ వ్యాప్తంగా సుమారు 4000 స్క్రీన్ లలో విడుదల కానుందని సమాచారం. ఒక సౌత్ సినిమా ఈ రేంజ్ లో హిందీ లో విడుదలవ్వడం ఇదే మొదటిసారి. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఈ చిత్రం యొక్క హిందీ హక్కులను భారీ ధరకు దక్కించుకున్నారు. ఇక ఈచిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా ముఖ్య పాత్రలో నటించడంతో అక్కడ ఈ చిత్రానికి మంచి క్రేజ్ వచ్చింది.

ఇక ఈ చిత్రం తెలుగులో కూడా భారీ స్థాయిలో విడుదలవుతుంది. ఒక్క హైదరాబాద్ లోనే సుమారు 600 స్క్రీన్ లలో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. అత్యంత భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా నవంబర్ 29నుండి థియేటర్లలో సందడి చేయనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు